గడిచిన కొద్దిరోజులుగ తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటున్నాయి. ఓవైపు ఎండలు దంచికొడుతుండగా… మరోవైపు కొన్నిచోట్ల వర్షాలు పడుతున్నాయి. మరికొన్నిచోట్ల ఈదురుగాలులు వీస్తుండగా… ఉరుములు, మెరుపులుతో కూడిన వానలు కురుస్తున్నాయి. మరో నాలుగైదు రోజుల పాటు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది.

ఏప్రిల్ 27, 2026న హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం…. రాష్ట్రంలో రాబోయే నాలుగైదు రోజుల పాటు తీవ్రమైన ఎండలుంటాయి. అంతేకాకుండా అకాల వర్షాలు పడే అవకాశం ఉంది. అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతం నుండి వీస్తున్న గాలుల ప్రభావంతో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఇవాళ మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ లో వాతావరణం మారిపోయింది. ఉరుములతో కూడిన గాలులు వీస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇవాళ సాయంత్రం లేదా రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం పడొచ్చు. ఉపరితల గాలులు దక్షిణం లేదా నైరుతి నుంచి వీచే అవకాశం ఉంది.
- ఏప్రిల్ 28వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఇదే సమయంలో నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
- ఏప్రిల్ 29వ తేదీన నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హన్మకొండ, మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
మే 3వ తేదీ వరకు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
{{/usCountry}}మే 3వ తేదీ వరకు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
{{/usCountry}}