...
...
Next Story

IMD Rain Alert : రాబోయే 2 - 3 గంటల్లో హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో వర్షం - వాతావరణశాఖ

తెలంగాణ, కర్ణాటకతో పాటు పలు ప్రాంతాల మీదుగా ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.

Published on: Apr 24, 2026, 17:03:59 IST
Advertisement

తెలంగాణకు, కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడే సూచనలున్నాయి.

ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్…

తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో వర్షాలు

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం…. రాబోయే 2 - 3 గంటల్లో హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.

రేపు(ఏప్రిల్ 25) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈనెల 26వ తేదీన పొడి వాతావరణం ఉండే అవకాశం ఉండగా.... 27వ తేదీ నుంచి మళ్లీ వర్షాలు పడనున్నాయి.మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో సోమవారం నాడు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

ఏప్రిల్ 28వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ ,మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఏపీలోనూ వర్షాలు…

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం పొడిగానే ఉండనుంది. వర్ష సూచన లేనప్పటికీ, ఉష్ణోగ్రతలు పెరగడం మరియు గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కంటే రాయలసీమలో ఎండల తీవ్రత అత్యధికంగా ఉండనుంది. రాబోయే నాలుగు రోజుల్లో రాయలసీమ ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe