Hyderabad : ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి - కేటాయింపు ఎప్పుడంటే..?
Indiramma Indlu GHMC : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. 16 నియోజకవర్గాల నుంచి 60,014 అప్లికేషన్లు రాగా, ఆగస్టు 20 తర్వాత లాటరీ పద్ధతిలో ఇళ్లను కేటాయించనున్నారు.
Indiramma Indlu GHMC : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. నగరంలోని మొత్తం 16 శాసనసభ నియోజకవర్గాల పరిధి నుంచి ఏకంగా 60,014 దరఖాస్తులు అధికారులకు అందాయి.

సొంతిల్లు లేని అర్హులైన పేదలకు పారదర్శకమైన విధానంలో ఇళ్లను అందిస్తామని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.వి. గౌతమ్ స్పష్టం చేశారు. ఈ నెల 20వ తేదీ తర్వాత కంప్యూటరైజ్డ్ పద్ధతిలో డ్రా (లాటరీ) నిర్వహించి అర్హులకు ఇళ్లను కేటాయించనున్నట్లు ఆయన వెల్లడించారు.
క్షేత్రస్థాయి పరిశీలన వేగవంతం….
వచ్చిన వేలాది దరఖాస్తులను అధికారులు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలిస్తున్నారు. దరఖాస్తుదారులు అందించిన సమాచారం సరైనదేనా, వారు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులేనా అనే అంశాలపై అధికారులు నేరుగా ఇళ్లకు వెళ్లి విచారణ జరుపుతున్నారు. అర్హులైన వారి జాబితాను సిద్ధం చేసిన తర్వాత, ఎవరికీ ఎలాంటి అనుమానాలు కలగకుండా పూర్తి పారదర్శకతతో కంప్యూటరైజ్డ్ లాటరీ విధానం ద్వారా ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
మొత్తంగా ఈ ఆగస్టు నెలాఖరు నాటికి అర్హులైన పేదలందరికీ ఇళ్లను కేటాయించాలనే స్పష్టమైన గడువును హౌసింగ్ బోర్డు నిర్దేశించింది. దీంతో త్వరలోనే నగరంలోని వేలాది మంది పేదలకు సొంతింటి కల నిజం కానుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

