తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ : మంత్రి పొన్నం

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఇందిరమ్మ చీరల పంపిణీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

Published on: Nov 23, 2025 5:00 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కోహెడలో ఇందిరా మహిళ శక్తి చీరలు పంపిణీ జరిగింది. 22 మందికి కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేశారు. కోహెడ మండల కేంద్రంలో అయ్యప్ప ఆలయానికి 10 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

చీరలు పంపిణీ చేస్తున్న మంత్రి పొన్నం
చీరలు పంపిణీ చేస్తున్న మంత్రి పొన్నం

కోహెడ మార్కెట్ యార్డును పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా పరిశీలించారు. గతంలో నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరుకాలేదని, ఇవాళ ఛైర్మన్ నిర్మల జయరాజ్, కమిటీ సభ్యులను సత్కరించారు. మార్కెట్ కమిటీకి కాంపౌండ్ వాల్ మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు స్థానికులు విజ్ఞప్తి చేశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చిందని చెప్పారు. 'ధాన్యం కొనుగోలు రైతుల ఖాతాల్లో డబ్బుల జమలో ఇబ్బందులు లేకుండా అధికారులు చూసుకోవాలి. త్వరలోనే మండలానికి ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ సెంటర్ రాబోతుంది. డాక్టర్లే వచ్చి వైద్య పరీక్షలు చేస్తారు. ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వండి. మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకు పోదాం.' అని రేవంత్ రెడ్డి అన్నారు.

మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్స్, బస్సులు ఇచ్చామని మంత్రి పొన్నం చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ప్రభుత్వం మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి మహిళా సంఘాల వాళ్లు చీరలు ఇస్తున్నారన్నారు.

'రాష్ట్రంలో ఎక్కడ మహిళ సంఘాల మీటింగ్ జరిగినా హుస్నాబాద్ స్టీల్ బ్యాంక్ ద్వారా ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా మారిందని చెప్పండి. నాకు ఒక అక్క చెల్లె ఉన్నారు. నా ఆడబిడ్డలతో సమానంగా మిమ్మల్ని చూసుకుంటాం. మీకు ఏ కష్టం రానివ్వను. గౌరవెల్లి ప్రాజెక్టు ఒక్కో మెట్టు పూర్తి చేసుకుంటున్నాం. త్వరలో పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్య శ్యామలం చేస్తాం. ప్రాజెక్టులో భూమి కోల్పోయినవారికి అన్ని విధాలుగా అండగా ఉంటాం.' అని మంత్రి పొన్నం తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More