...
...
Next Story

Telangana Bhu Bharati : ఐదు మండలాల్లో భూభారతి అమలు.. స్మార్ట్‌ఫోన్ నుంచి సేవలు

Bhu Bharati : తెలంగాణలోని 5 మండలాల్లో గురువారం(ఏప్రిల్ 2) నుంచి ఇంటిగ్రేటెడ్ భూభార‌‌‌‌తి పోర్టల్‌‌‌‌ను ప్రయోగాత్మకంగా అమలు అవుతోంది. స్మార్ట్‌ఫోన్‌తో ఇంటి నుంచి సర్వీసులు పొందవచ్చు.

Published on: Apr 2, 2026, 09:41:15 IST
Advertisement

తెలంగాణ రాష్ట్రంలోని ఐదు మండలాల్లో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ప్రయోగత్మకంగా అమలు చేస్తోంది రెవెన్యూ శాఖ. ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా అమనగల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, నారాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు రెవెన్యూ శాఖ విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని ప్రభుత్వం చెబుతోంది. రైతులకు పారదర్శకమైన, సులభతరమైన సేవలు అందించేందుకు ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుకు కిందకు తెస్తూ.. ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్‌ను ప్రభుత్వం రూపొందించింది.

ఇంటిగ్రేటెడ్ భూభార‌‌‌‌తి
ఇంటిగ్రేటెడ్ భూభార‌‌‌‌తి

ఈ ఐదు మండలాల్లో వచ్చే ఫలితాల ఆధారంగా.. మార్పులు, చేర్పులు చేసి భవిష్యత్తులో ముందుకు వెళ్లనుంది ప్రభుత్వం. కేర‌‌‌‌ళ ప‌‌‌‌ర్యట‌‌‌‌న‌‌‌‌లో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీ‌‌‌‌నివాస్‌‌‌‌రెడ్డి.. భూభారతి పోర్టల్‌‌‌‌ గురించి ఇప్పటికే రెవెన్యూ అధికారుల‌‌‌‌తో మాట్లాడారు. ఈ ఇంటిగ్రేటెడ్ భూభార‌‌‌‌తి పోర్టల్‌‌‌‌ను రైతు కోణంలో రూపొందించామ‌‌‌‌న్నారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి 5 మండ‌‌‌‌లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించి భూ వివాదాల ప‌‌‌‌రిష్కారానికి తొలి అడుగు వేస్తున్నట్టుగా చెప్పారు.

'భూభారతి పోర్టల్ ప్రారంభానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు ఈ పోర్టల్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి. గతంలో మాదిరిగా రైతులు భూ సేవల కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పని లేదు. ఇంటి నుంచే భూ సేవలు పొందే విధంగా పోర్టల్‌ను రూపొందించాం.' మంత్రి పొంగులేటి చెప్పారు..

గతంలో రైతులు భూ సేవల కోసం మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇక మీదట ఇంటి నుంచే భూ సేవలు పొందవచ్చు. గతంలో రైతులు భూమి హద్దులు తేల్చేందుకు సర్వే అధికారుల చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు ఎక్కడకు వెళ్లాల్సిన అవరసం లేదు. ఇంటి నుంచి భూభారతి పోర్టల్ ద్వారా పొందవచ్చు. రైతు లాగిన్ అయిన తర్వాత భూమి వివరాలు కనపడతాయి. ఎన్ని ఎకరాలకు సర్వే కావాలో కోరితే.. దానికి సంబంధించిన ఫీజు ఎంత చెల్లించాలో చూపిస్తుంది. ఫీజు చెల్లించిన తర్వాత.. వివరాలు గ్రామంలో ఉన్న లైసెన్స్‌‌‌‌డ్ స‌‌‌‌ర్వేయ‌‌‌‌ర్ లాగిన్‌‌‌‌కు వస్తాయి.

ఈ ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్ దరఖాస్తు ప్రారంభం నుంచి పూర్తయ్యేదాకా ప్రతి దశలోనూ రిజిస్టర్డ్ మెుబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ అలర్ట్స్ వస్తాయి. ప్రతీ సర్వే మ్యాప్ యూనిక్ నెంబర్‌తోపాటుగా ప్రతి సర్వే నెంబర్‌కు ఆధార్ నెంబర్ మాదిరిగానే.. భూధార్ నెంబర్ కూడా ఇస్తారు. ప్రస్తుతం 5 మండలాల్లో ఈ వ్యవస్థకు సంబంధించిన అన్ని అందుబాటులో ఉంచారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks