...
...
Next Story

హైదరాబాద్ నుంచి అరుణాచల మోక్ష యాత్ర.. గిరిప్రదక్షిణ చేయాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ బెస్ట్ ప్యాకేజీ!

తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం వెళ్లే భక్తుల సంఖ్య ఇటీవల ఎక్కువైంది. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర పేరుతో టూర్ ప్యాకేజీ రన్ చేస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ టూర్ ప్యాకేజీ ఉంది.

Published on: Nov 1, 2025, 17:56:18 IST
Advertisement

అరుణాచల శివయ్యను దర్శించుకోవాలని తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు వెళ్తుంటారు. ఇటీవలి కాలంలో అరుణాచలం వెళ్లి గిరిప్రదక్షిణ చేసే వారి సంఖ్య పెరిగింది. అయితే అలాంటి వారికి గుడ్‌న్యూస్. ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర పేరుతో టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి వెళ్లాలి అనుకుంటే ఈ స్పెషల్ ప్యాకేజీని ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం..

ఈ టూర్ ఎప్పుడు?

ఐఆర్‌సీటీసీ అరుణాచలం టూర్ ప్యాకేజీ
ఐఆర్‌సీటీసీ అరుణాచలం టూర్ ప్యాకేజీ

ఈ ప్యాకేజీ ప్రతీ శుక్రవారం ఉంటుంది. నవంబర్ 7వ తేదీన ఈ టూర్ ఉంది. ఇందులో అరుణాచలం మాత్రమే కాదు పుదుచ్చేరి, కాంచీపురం కూడా చూడొచ్చు. కాచిగూడ నుంచి 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు రైలు ఉంటుంది. నాలుగు రాత్రులు, ఐదు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ట్రైన్ ప్రయాణం, హోటల్ వసతి, ఆలయ దర్శనాలు ఉంటాయి.

ఐదు రోజులు

అరుణాచల మోక్ష యాత్ర ప్రతీ శుక్రవారం మెుదలవుతుంది. కాచిగూడ టూ పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌లో మెుదటి రోజు అంతా ప్రయాణం ఉంటుంది. రెండో రోజు అంటే శనివారం నాడు పుదుచ్చేరికి ఉదయం 11.05 గంటలకు చేరుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకుని.. ఆరోవిల్లే, అరబిందో ఆశ్రమం, ప్యారడైజ్ బీచ్ చూస్తారు. రాత్రి పుదుచ్చేరిలోనే బస ఉంటుంది.

మూడో రోజు శనివారం ఉదయం హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసి.. అరుణాచలం బయలుదేరుతారు. సుమారు 120 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ హోటల్‌లో చెకిన్ చేసిన తర్వాత అరుణాచలం శివయ్యను దర్శించుకోవచ్చు. గిరిప్రదక్షిణ చేయవచ్చు. రాత్రికి బస అరుణాచలంలోనే ఉంటుంది.

నాల్గో రోజు ఆదివారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి కాంచీపురానికి బయలుదేరుతారు. అరుణాచలం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కామాక్షి అమ్మన్ టెంపుల్, ఏకాంబరేశ్వర ఆలయం తీసుకెళ్తారు. తర్వాత 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరక్కోణం స్టేషన్ వెళ్తారు. తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఐదో రోజు సోమవారం ఉదయం కాచిగూడకు చేరుకోవడంతో అరుణాచల మోక్ష యాత్ర టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు

బ్రేక్ ఫాస్ట్ తప్ప, ట్రైన్‌లో ఆహారం, లంచ్, డిన్నర్ ఇందులో ఇవ్వరు. దర్శనాల కోసం ఎంట్రీ టికెట్స్, బోటింగ్, హార్స్ రైడింగ్, ఇతర ఏమైనా యాక్టివిటీస్ కోసం ఖర్చులను ప్రయాణికులే చూసుకోవాలి. అందుకే టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లోచూడండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks