మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.
IRCTC Shirdi Tour Package : షిర్డీ, త్రయంబకేశ్వర్, నాసిక్ యాత్ర - డిసెంబర్ లో జర్నీ, IRCTC టూర్ ప్యాకేజీ ఇదే
షిర్డీ, త్రయంబకేశ్వర్, నాసిక్ క్షేత్రాలను సందర్శించేలా ఐఆర్సీటీసీ 'సాయి శివం' టూర్ ప్యాకేజీని అందిస్తోంది. మూడు రాత్రులు, నాలుగు రోజుల ఈ యాత్ర ప్రతి శుక్రవారం కాచిగూడ నుంచి ప్రారంభమవుతుంది.
షిర్డీ సాయిబాబా ఆలయం, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, నాసిక్‌లోని పంచవతి క్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం IRCTC టూరిజం అప్డేట్ ఇచ్చింది. 'సాయి శివం' (ప్యాకేజీ కోడ్ - SHR008) టూర్ ప్యాకేజీని నిర్వహిస్తోంది. మూడు రాత్రులు, నాలుగు రోజుల పాటు సాగే ఈ ప్యాకేజీ ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం డిసెంబర్ 4వ తేదీన జర్నీ ఉంది.

టూర్ షెడ్యూల్ :
- మొదటి రోజు (శుక్రవారం) రాత్రి 6.30 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి 17064 నంబరు గల అజంతా ఎక్స్‌ప్రెస్ ద్వారా ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా రైలు ప్రయాణం సాగుతుంది.
- రెండో రోజు (శనివారం) ఉదయం 7.10 గంటలకు నాగర్సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి పికప్ చేసుకుని షిర్డీలోని హోటల్‌కు తరలిస్తారు. హోటల్లో అల్పాహారం తీసుకున్న తర్వాత షిర్డీ ఆలయాన్ని దర్శించుకోవాలి. దర్శన టికెట్ ప్యాకేజీలో కలవదు. సాయంత్రం షిర్డీలో విశ్రాంతి తీసుకుని, రాత్రికి అక్కడే బస చేస్తారు.
- మూడో రోజు (ఆదివారం) హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ ముగించుకుని చెక్ అవుట్ చేస్తారు. అక్కడి నుంచి 120 కిలోమీటర్ల దూరంలోని త్రయంబక్కు బయలుదేరుతారు. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం 30 కిలోమీటర్ల దూరంలోని నాసిక్‌కు వెళ్తారు. అక్కడ పంచవటి ప్రాంతాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 90 కిలోమీటర్ల దూరంలోని నాగర్సోల్కు బయలుదేరి, రాత్రి 8.30 గంటలకు స్టేషన్‌కు చేరుకుంటారు. రాత్రి 9.20 గంటలకు 17063 అజంతా ఎక్స్‌ప్రెస్ ఎక్కి తిరుగు ప్రయాణం మొదలుపెడతారు.
- నాలుగో రోజు (సోమవారం) ఉదయం 9.45 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీ ధరలు :
కంఫర్ట్ (3ఏసీ), స్టాండర్డ్ (స్లీపర్ నాన్ ఏసీ) కేటగిరీలలో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఒక్కో ప్రయాణికుడికి నిర్ణయించిన ఛార్జీలు ఇలా ఉన్నాయి…
కంఫర్ట్ (3ఏసీ) సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 11,560, డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 9,430, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 9,240 నిర్ణయించారు. ఐదు నుంచి పదకొండు ఏళ్లలోపు పిల్లలకు బెడ్‌తో కలిపి రూ. 8,400, బెడ్ లేకుండా రూ. 7,460 ఛార్జీ వసూలు చేస్తారు.
స్టాండర్డ్ (స్లీపర్) సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 9,870, డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 7,740, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 7,550గా ధరలు ఉన్నాయి. ఐదు నుంచి పదకొండు ఏళ్ల పిల్లలకు బెడ్‌తో రూ. 6,710, బెడ్ లేకుండా రూ. 5,770 చెల్లించాలి. ప్రతి శుక్రవారం నడిచే ఈ ప్యాకేజీలో స్టాండర్డ్ క్లాస్‌లో 16 సీట్లు, కంఫర్ట్ క్లాస్‌లో 6 సీట్లు అందుబాటులో ఉంటాయి.
టికెట్ రద్దు చేసుకోవాలంటే www.irctctourism.com వెబ్‌సైట్‌లోని బుకింగ్ హిస్టరీ ద్వారా మాత్రమే చేయాలి. పీఆర్ఎస్ కౌంటర్లలో రద్దు కుదరదు. ప్రయాణానికి 15 రోజుల ముందు వరకు రద్దు చేస్తే ప్రయాణికుడికి రూ. 250 కట్ చేస్తారు. 8 నుంచి 14 రోజుల ముందు అయితే ప్యాకేజీ ధరలో 25 శాతం, 4 నుంచి 7 రోజుల ముందు అయితే 50 శాతం, నాలుగు రోజుల కంటే తక్కువ సమయంలో రద్దు చేస్తే 100 శాతం మొత్తం కట్ చేస్తారు.
మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్‌లోని ఐఆర్సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్ కార్యాలయాన్ని (040-27702407, 9701360701) లేదా విజయవాడ (8287932312), తిరుపతి (8287932313) రైల్వే స్టేషన్లలోని ఐఆర్సీటీసీ టూరిజం సమాచార కేంద్రాలను సంప్రదించవచ్చు.

E-Paper
