హైదరాబాద్ టు శ్రీశైలం, యాదాద్రి - ఈ IRCTC టూర్ ప్యాకేజీ చూడండి

శ్రీశైలం ట్రిప్ ప్లాన్ ఉందా..? మీలాంటి వారి కోసం IRCTC టూరిజం కొత్త ప్యాకేజీ తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా యాదాద్రికి కూడా వెళ్తారు. ముఖ్యమైన వివరాలను పూర్తి కథనంలో తెలుసుకోండి

Published on: Nov 20, 2025, 18:27:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అధ్యాత్మిక ప్రాంతానికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీ కోసం బడ్జెట్ ధరలోనే మంచి టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది ఐఆర్సీటీ టూరిజం. ఒకే ప్యాకేజీలో పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూసేలా ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి ''స్పిరిచువల్ తెలంగాణ విత్ శ్రీశైలం" పేరుతో ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది.

హైదరాబాద్ - శ్రీశైలం టూర్ ప్యాకేజీ
హైదరాబాద్ - శ్రీశైలం టూర్ ప్యాకేజీ

చూస్తే ప్రాంతాలు - టూర్ షెడ్యూల్ వివరాలు:

ఈ కొత్త టూర్ ప్యాకేజీలో భాగంగా శ్రీశైలం చూడొచ్చు. అంతేకాకుండా హైదరాబాద్ సిటీలోని చార్మినార్, సలార్ జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్, గోల్కోండ ఫోర్టును సందర్శిస్తారు. ఫైనల్ గా యాదాద్రి నర్సింహ్మా స్వామిని దర్శించుకోవటంతో టూర్ ముగుస్తుంది. చివరగా యాదాద్రి కూడా వెళ్తారు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 25 నవంబర్ 2025వ తేదీన అందుబాటులో ఉంది.ఈ తేదీ మిస్ అయిత్ మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. మొత్తం 4 రోజుల ప్యాకేజీ ఇది.

  1. మొదటి రోజు హైదరాబాద్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. చార్మినార్, సలార్ జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్ ను చూస్తారు. ఆ తర్వాత హోటల్ కు వెళ్తారు. రాత్రి హైదరాబాద్ లోనే బస చేస్తారు.
  2. 2వ రోజు ఉదయం 5 గంటలకు శ్రీశైలం వెళ్తారు. మల్లిఖార్డున స్వామి దర్శనం ఉంటుంది. సాయంత్రం వరకు హైదరాబాద్ తిరిగి చేరుకుంటారు. తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
  3. మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…. బిర్లా మందిర్ వెళ్తారు. ఆ తర్వాత గొల్కోండ ఖిల్లాను చూస్తారు. మధ్యాహ్నం అంబేడ్కర్ విగ్రహం చూస్తారు. రాత్రి హైదరాబాద్ లోనే బస చేస్తారు.
  4. టూర్ ప్యాకేజీలో చివరి రోజు భాగంగా ఉదయం యాదాద్రికి వెళ్తారు. సురేంద్రపురిని కూడా సందర్శిస్తారు. సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ఈ ప్యాకేజీ ధరలను చూస్తే…. డబుల్ షేరింగ్ కు రూ. 19,890, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15,010గా నిర్ణయించారు. ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. ఈ టూరిజం ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలంటే… https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ప్యాకేజీలో భోజన వసతితో పాటు మరికొన్ని సదుపాయాలు ఉంటాయి. ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 8287932228 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More