Jubilee Hills By Election Result Live : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ హవా - 24,729 ఓట్ల తేడాతో విజయం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సత్తా చాటింది. ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించిన నవీన్ యాదవ్… 24,729 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.లైవ్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి….

నవీన్ యాదవ్ విజయం
నవీన్ యాదవ్ విజయం

ఇవాళ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం తేలింది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 10 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియను పూర్తి చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్… ఈ ఉపఎన్నికలో విజయం సాధించారు.

...Read More

Follow all the updates here:
Nov 14, 2025, 15:24:02 IST

జూబ్లీహిల్స్‌ ప్రజలకు పాదాభివందనం - నవీన్ యాదవ్

“జూబ్లీహిల్స్‌ ప్రజలకు పాదాభివందనం. భారీ మెజారిటీతో నన్ను జూబ్లీహిల్స్‌ ప్రజలు గెలిపించారు. జూబ్లీహిల్స్‌ ప్రజలు, కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చెయ్యను. అందరితో కలుపుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా” అని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ చెప్పారు.

Nov 14, 2025, 14:53:45 IST

ముగిసిన ఉప ఎన్నిక కౌంటింగ్ - ఓట్ల శాతం

కాంగ్రెస్ - 98,988 (50.83%)

బీఆర్ఎస్ - 74,259 (38.13%)

బీజేపీ - 17,061 (8.76%)

Nov 14, 2025, 14:49:56 IST

ఈసీ అధికారిక ప్రకటన

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై ఎన్నికల కమిషన్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్‌కు 98,988 ఓట్లు, బీఆర్ఎస్‌కు 74,259 ఓట్లు.. బీజేపీకి 17,061 ఓట్లు దక్కాయి. బీఆర్ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్ విజయం సాధించారు.

Nov 14, 2025, 13:56:06 IST

పోరాటం కొనసాగిస్తాం - కేటీఆర్

ఉపఎన్నిక ఫలితంపై కేటీఆర్ స్పందించారు. పారదర్శకంగా ఎన్నికలో పని చేశామన్నారు. ప్రజా సమస్యలను ప్రజల్లో చర్చకు పెట్టామని వివరించారు. తమ పోరాటం నిరంతరం కొనసాగుతోందన్నారు.

Nov 14, 2025, 13:44:20 IST

మెజార్టీ ఎంతంటే

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24658 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Nov 14, 2025, 13:42:55 IST

కాంగ్రెస్ విజయం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సత్తా చాటింది. ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించిన నవీన్ యాదవ్… 24 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Nov 14, 2025, 13:17:42 IST

నైతిక విజయం నాదే - మాగంటి సునీత

నైతికంగానే తానే విజయం సాధించాని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వ్యాఖ్యానించారు. అన్ని పార్టీలు కలిసి వచ్చాయని… రిగ్గింగ్ చేసి ఇక్కడ ఓడించారని ఆరోపించారు.

Nov 14, 2025, 13:15:38 IST

రిగ్గింగ్ తోనే వారి విజయం - సునీత

రిగ్గింగ్ తో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఆరోపించారు. ఓ మహిళపై ఇంత అన్యాయం చేయటం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. రౌడీ రాజ్యంగా ఈ ఉపఎన్నిక జరిగిందన్నారు.

Nov 14, 2025, 13:09:14 IST

24 వేల ఓట్ల ఆధిక్యం

10వ రౌండ్ లోనూ కాంగ్రెస్ కే లీడ్ వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం 24 వేలకుపైగా ఓట్ల ఆధిక్యాన్ని నవీన్ యాదవ్ సాధించారు.

Nov 14, 2025, 13:01:42 IST

కాంగ్రెస్‌ ఘన విజయం

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్‌ అభ్యర్థి సునీతా గోపినాథ్‌పై దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ విజయం సాధించారు. కాసేపట్లో అధికారికంగా ఎన్నికల కమిషన్‌ ప్రకటన చేయనుంది.

Nov 14, 2025, 12:58:08 IST

23,612 ఓట్ల ఆధిక్యం

9వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 2,117 ఓట్ల మెజార్టీ దక్కింది. దీంతో 9 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్ యాదవ్… 23,612 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Nov 14, 2025, 12:51:54 IST

వచ్చే 8 ఏళ్లు మాదే అధికారం - పీసీసీ చీఫ్

కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పీపీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ వంద సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 8 ఏళ్లు అధికారంలో ఉంటామన్నారు.

Nov 14, 2025, 12:38:37 IST

దూసుకెళ్తున్న కాంగ్రెస్

జూబ్లీహిల్స్‌ఉప ఎన్నిక కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఎనిమిదో రౌండ్‌లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ దూసుకెళ్తున్నారు. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే సరికి 24,800 ఓట్లతో లీడ్‌లో ఉన్నారు.

Nov 14, 2025, 12:10:09 IST

విజయం దిశగా కాంగ్రెస్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. 50 శాతానికిపైగా ఓట్లు కూడా దక్కే అవకాశం ఉంది.

Nov 14, 2025, 11:47:07 IST

కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన దీపక్ రెడ్డి

కౌంటింగ్ కేంద్రం నుంచి బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… ఈ ఉపఎన్నికలో డబ్బు ప్రభావం ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

Nov 14, 2025, 11:46:08 IST

7వ రౌండ్ లోనూ లీడ్

7వ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి 4 వేలకుపైగా లీడ్ లభించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 19 వేల లీడ్ లో ఉన్నారు.

Nov 14, 2025, 11:35:24 IST

15,589 ఓట్ల లీడ్ లో కాంగ్రెస్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఆరో రౌండ్‌ కౌంటింగ్‌ ముగిసింది. 6వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 2,938 ఓట్ల ఆధిక్యం లభించింది. ఆరు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 15,589 ఓట్ల లీడ్ లో ఉంది.

Nov 14, 2025, 11:15:59 IST

పెరుగుతున్న ఆధిక్యం

ఆరో రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీనే లీడ్ లో ఉంది. ఈ రౌండ్ తర్వాత 15 వేల ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ లీడ్ లో ఉన్నారు.

Nov 14, 2025, 11:08:16 IST

గాంధీ భవన్ లో సంబరాలు

గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఎన్నిక ఏదైనా సరే తమదే విజయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Nov 14, 2025, 10:55:47 IST

దూసుకెళ్తున్న కాంగ్రెస్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ లో 5వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీకి 12,651 ఓట్ల మెజారిటీ లీడ్ దక్కినట్లు తెలుస్తోంది. ఈ రౌండ్ లో కూడా 3 వేలకుగా లీడ్ లభించినట్లు సమాచారం.

Nov 14, 2025, 10:22:22 IST

బీజేపీకి థర్డ్ ప్లేస్

బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ప్రతి రౌండ్ లోనూ ఆశించిన స్థాయిలో ఓట్లు దక్కడం లేదు. కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ కొనసాగుతోంది.

Nov 14, 2025, 10:01:58 IST

బీఆర్ఎస్ కు లీడ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. మూడో రౌండ్ లో బీఆర్ఎస్ కు స్వల మెజార్టీ దక్కింది. మూడో రౌండ్ లో బీఆర్ఎస్ కు 211 ఓట్ల లీడ్ దక్కింది. మూడు రౌండ్లు పూర్తి కాగా… కాంగ్రెస్ ఇంకా 900 ఓట్లకుపైగా లీడ్ లో ఉంది.

Nov 14, 2025, 09:56:11 IST

గెలువబోతున్నాం - పీసీసీ చీఫ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. తప్పకుండా కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పారు.

Nov 14, 2025, 09:26:00 IST

లీడ్ లో కాంగ్రెస్

జూబ్లీహిల్స్ రెండో రౌండ్ లో కాంగ్రెస్‌కు 9,691, బీఆర్ఎస్‌కు 8,609 ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండ్ లో కాంగ్రెస్ కు 1082 లీడ్ రాగా… మొదటి 2 రౌండ్లు కలిపి 1144 లీడ్ దక్కింది.

Nov 14, 2025, 09:17:57 IST

రెండో రౌండ్ పూర్తి..

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ కు లీడ్ లభించింది. రెండు రౌండ్లు కలిపి 1,082 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది.

Nov 14, 2025, 09:15:20 IST

రెండో రౌండ్ లోనూ కాంగ్రెస్….

జూబ్లీహిల్స్ ఉపఎన్ని రెండో రౌండ్ లో కాంగ్రెస్ కు ఆధిక్యం లభించినట్లు తెలుస్తోంది. రెండో రౌండ్ తర్వాత నవీన్ యాదవ్ 1100 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం.

Nov 14, 2025, 09:13:39 IST

కాంగ్రెస్ కు 62 ఓట్ల లీడ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక మొదటి రౌండ్ లో కాంగ్రెస్ కు స్వల్ప మెజార్టీ దక్కింది. కేవలం 62 ఓట్ల తేడాతో నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ కు 8926 ఓట్ల రాగా… బీఆర్ఎస్ - 8864 పోలయ్యాయి.

Nov 14, 2025, 08:51:20 IST

పోస్టల్ ఓట్ల లెక్క

మొత్తం పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 101

కాంగ్రెస్ - 39

బీఆర్ఎస్ - 36

బీజేపీ - 10

Nov 14, 2025, 08:38:42 IST

పోస్టల్ ఓట్లు ఇలా…..

101 పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్ కు 39 ఓట్లు రాగా, బీఆర్ఎస్ కు 36 ఓట్లు పోలయ్యాయి.

Nov 14, 2025, 08:24:55 IST

పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తి…

101 పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. కాసేపట్లో త్వరలోనే వీటికి సంబంధించిన ఫలితాన్ని ప్రకటిస్తారు.

Nov 14, 2025, 08:18:54 IST

101 పోస్టల్ ఓట్ల లెక్కింపు…

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 101 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. వీటిని ప్రస్తుతం లెక్కిస్తున్నారు.

Nov 14, 2025, 08:17:33 IST

మధ్యాహ్నం వరకు ఫలితం….

జూబ్లీహిల్స్ ఫలితంపై మధ్యాహ్నం వరకు పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరికాసేపట్లో ట్రెండ్స్ తెలియనున్నాయి.

Nov 14, 2025, 08:16:40 IST

కౌంటింగ్‌ వేళ విషాదం

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ వేళ విషాదం చోటు చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థి మహమ్మద్‌ అన్వర్‌ (40) గుండెపోటుతో మృతి చెందారు. ఎర్రగడ్డలో మహమ్మద్‌ అన్వర్ నివాసం ఉంటున్నారు.

Nov 14, 2025, 08:15:07 IST

ముందుగా షేక్ పేట డివిజన్ ఓట్లు….

పోస్టల్ ఓట్ల తర్వాత షేక్ పేట డివిజన్ ఓట్లను ముందుగా లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారు.

Nov 14, 2025, 08:03:45 IST

ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రారంభం

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్స్‌ ఓట్లను లెక్కిస్తున్నారు.

Nov 14, 2025, 07:45:43 IST

ఉదయం 8 గంటలకు ప్రారంభం

మరికాసేపట్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్లను లెక్కించనున్నారు. సరిగ్గా ఉదయం 8 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

Nov 14, 2025, 07:31:53 IST

కౌంటింగ్ వివరాలు:

కౌంటింగ్ తేదీ - 14 నవంబర్ 2025

కౌంటింగ్ టేబుల్స్ - : 42

కౌంటింగ్ రౌండ్లు: 10

Nov 14, 2025, 07:31:33 IST

పోలైన ఓట్లు:

మొత్తం పోలైన ఓట్లు: 1,94,631

పురుషులు: 99,771

మహిలలు: 94,855

ఇతరులు: 05

పోలింగ్ శాతం: 48.49 శాతం

Nov 14, 2025, 07:31:03 IST

పోలింగ్ శాతం వివరాలు

నవంబర్ 11వ తేదీన జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మొత్తం 48.49 పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.ఇందులో రహ్మత్‌నగర్‌ డివిజన్‌లోని 15 కేంద్రాల్లో, బోరబండ డివిజన్‌లోని 13, ఎర్రగడ్డలో 3, వెంగళరావునగర్‌లో ఒక చోట 60 శాతానికిపైగా పోలింగ్‌ నమోదైంది. ఈ ఉపఎన్నిక ఫలితాల్లో ఈ డివిజన్లలోని ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉంది.

Nov 14, 2025, 07:30:49 IST

144 సెక్షన్ అమలు

కౌంటింగ్‌ను ఎప్పటికప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ పరిశీలిస్తారు. అభ్యర్థులు, ఏజెంట్లకు తప్ప ఇతరులకు కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు.కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.

Nov 14, 2025, 07:30:40 IST

భారీ భద్రత

ఓట్ల లెక్కింపు చేపట్టే కేంద్రం వద్ద భారీగా భద్రత ఏర్పాటు చేశారు.ఇక కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించడానికి స్పెషల్ అధికారిని ఏర్పాటు చేశారు. మొత్తం 186 మంది కౌంటింగ్ సిబ్బందిగా పని చేస్తారు.

Nov 14, 2025, 07:27:32 IST

షేక్ పేట డివిజన్ నుంచి మొదలు..

ఒకటో నెంబర్‌ పోలింత్‌ బూత్‌ షేక్‌పేట డివిజన్‌ నుంచి కౌంటింగ్ ప్రారంభమై ఎర్రగడ్డతో ముగియనుంది. రౌండ్ల వారీగా ఓట్ల కౌంటింగ్ వివరాలను ప్రకటించేలా ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేశారు.

Nov 14, 2025, 07:27:19 IST

10 రౌండ్లలో ఫలితాలు

ఈ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో ఉపఎన్నిక ఫలితం తేలుతుంది.

Nov 14, 2025, 07:26:57 IST

విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో ఏర్పాట్లు

ఉద‌యం 8 గంట‌ల‌కే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది.

Nov 14, 2025, 07:26:32 IST

ఇవాళే తీర్పు

ఇవాళ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం తేలనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతంది. మొత్తం 10 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియను పూర్తి చేస్తారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

Home Telangana Jubilee Hills By Election Result Live : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ హవా - 24,729 ఓట్ల తేడాతో విజయం