రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలోని కరీంనగర్ లోని నర్సింగ్ కాలేజీలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఎలక్ట్రిషియన్, కుక్, ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, కిచెన్ బాయ్ ఉద్యోగాలున్నాయి. వీటిని ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
నోటిఫికేషన్ వివరాలు:
- ఉద్యోగ ప్రకటన - ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, కరీంనగర్, తెలంగాణ రాష్ట్రం
- భర్తీ చేసే ఉద్యోగాలు - డేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఎలక్ట్రిషియన్, కుక్, ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, కిచెన్ బాయ్
- దరఖాస్తు విధానం - ఆఫ్ లైన్
- కరీంనగర్ జిల్లా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- బయోడేటాతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను గెజిటెడ్ ఆఫీసర్ తో అటెస్టేషన్ చేయించుకోవాలి.
- 18 నుంచి 44 ఏళ్ల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కొన్ని సడలింపులుంటాయి.
- పోస్టును బట్టి విద్యా అర్హతలను నిర్ణయించారు. టెన్త్ నుంచి డిగ్రీ వరకు అర్హతులను పేర్కొన్నారు. లైబ్రేరియన్ పోస్టుకు మాత్రం తప్పకుండా BLiscలో ఉత్తీర్ణత ఉండాలి.
- జనవరి 12వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తును సమర్పించాలి.
- దరఖాస్తు ఇవ్వాల్సిన చిరునామా - ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, గణేశ్ నగర్, డోర్ 8-7-326/డి చిరునామా నందు సమర్పించాలి.
- సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ - 9502707616

{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}