BDL హైదరాబాద్‌లో 80 ఉద్యోగాలు - దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..!

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్‌ (బీడీఎల్)లో  మేనేజ్‌మెంట్ ట్రెయినీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు రేపటితో( డిసెంబర్ 29) పూర్తి కానుంది.

Published on: Dec 28, 2025, 09:12:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్‌ లోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 80 పోస్టులున్నాయి. ఈ పోస్టుల భర్తీ కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు దగ్గరపడింది.

బీడీఎల్ హైదరాబాద్‌లో 80 ఉద్యోగ ఖాళీలు -
బీడీఎల్ హైదరాబాద్‌లో 80 ఉద్యోగ ఖాళీలు -

అర్హులైన అభ్యర్థులు రేపటి లోపు (డిసెంబర్ 29) అప్లయ్ చేసుకోవచ్చు. అది కూడా సాయంత్రం 4 గంటలలోపు వరకే ఛాన్స్ ఉంటుంది. https://online.cbexams.com/ లింక్ తో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

మొత్తం 9 విభాగాల్లో 80 ఖాళీలుండగా… రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. నెలకు రూ.40,000 - రూ.1,40,000 జీతం చెల్లిస్తారు.

బీడీఎల్, హైదరాబాద్ నోటిఫికేషన్ వివరాలు:

  • ఉద్యోగ ప్రకటన - భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్), హైదరాబాద్
  • ఉద్యోగ ఖాళీలు -మేనేజ్‌మెంట్ ట్రెయినీ
  • మొత్తం ఖాళీలు - 80
  • విభాగాలు - ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్‌ సైన్స్‌, మెటలర్జీ, కెమికల్, సివిల్, ఫైనాన్స్‌, హ్యుమన్ రిసోర్సెస్
  • అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 55 నుంచి 60 శాతం మార్కులతో డిగ్రీ ఉండాలి. పూర్తి వివరాలను https://bdl-india.in/recruitments వెబ్ సైట్ లో చూడొచ్చు.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్
  • దరఖాస్తులకు తుది గడువు - 29 డిసెంబర్ 2025
  • నెల జీతం - రూ. 40,000 - రూ. 1,40,000
  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
  • కంప్యూటర్ బేస్డ్ పరీక్ష 2 గంటలు ఉంటుంది. ఇందులో నుంచి 85 శాతం వెయిటేజీ ఇస్తారు. మిగతా 15 శాతం ఇంటర్వ్యూకు కేటాయిస్తారు.
  • పరీక్షా కేంద్రాలు - హైదరాబాద్, విజయవాడతో పాటు అహ్మాదాబాద్, గాంధీనగర్, బెంగళూర్, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, కోల్ కత్తా, లక్నో, ముంబై, త్రివేండ్రం
  • అధికారిక వెబ్ సైట్ - https://bdl-india.in/recruitments

ఈ లింక్ పై క్లిక్ చేసి నేరుగా దరఖాస్తు ప్రాసెస్ చేసుకోవచ్చు

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More