ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు - దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..?

కరీంనగర్ లోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ పోస్టుల భర్తీకి ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 12లోపు అప్లయ్ చేసుకోవాలి.

Published on: Jan 3, 2026, 13:42:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలోని కరీంనగర్ లోని నర్సింగ్ కాలేజీలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఎలక్ట్రిషియన్, కుక్, ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, కిచెన్ బాయ్ ఉద్యోగాలున్నాయి. వీటిని ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ఉద్యోగాలు
ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ఉద్యోగాలు

నోటిఫికేషన్ వివరాలు:

  • ఉద్యోగ ప్రకటన - ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, కరీంనగర్, తెలంగాణ రాష్ట్రం
  • భర్తీ చేసే ఉద్యోగాలు - డేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఎలక్ట్రిషియన్, కుక్, ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, కిచెన్ బాయ్
  • దరఖాస్తు విధానం - ఆఫ్ లైన్
  • కరీంనగర్ జిల్లా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • బయోడేటాతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను గెజిటెడ్ ఆఫీసర్ తో అటెస్టేషన్ చేయించుకోవాలి.
  • 18 నుంచి 44 ఏళ్ల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కొన్ని సడలింపులుంటాయి.
  • పోస్టును బట్టి విద్యా అర్హతలను నిర్ణయించారు. టెన్త్ నుంచి డిగ్రీ వరకు అర్హతులను పేర్కొన్నారు. లైబ్రేరియన్ పోస్టుకు మాత్రం తప్పకుండా BLiscలో ఉత్తీర్ణత ఉండాలి.
  • జనవరి 12వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తును సమర్పించాలి.
  • దరఖాస్తు ఇవ్వాల్సిన చిరునామా - ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, గణేశ్ నగర్, డోర్ 8-7-326/డి చిరునామా నందు సమర్పించాలి.
  • సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ - 9502707616
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More