1 Lakh Reward : కరీంనగర్‌లో భారీ చోరీ.. నిందితుల ఆచూకీ తెలిపితే రూ. లక్ష రివార్డ్!
1 Lakh Reward : కరీంనగర్‌లో పట్టపగలు నగల దుకాణంలో చోరీ అయిన విషయం తెలిసిందే. నిందితులను పట్టిస్తే లక్షల రూపాయల నగదు బహుమతి అందించనున్నట్టుగా పోలీసులు ప్రకటించారు.
కరీంనగర్ నగరం నడిబొడ్డున పట్టపగలే గన్లతో హల్‌చల్ చేశారు దుండగులు. పీఎంజే నగల దుకాణంలో కాల్పులకు తెగబడి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ టెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. అంతేకాదు నిందితుల ఆచూకీ నగదు బహుమతి కూడా అందుకోవచ్చు.

లక్ష రూపాయల బహుమతి
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే క్లూస్ టీంతో రంగంలోకి దిగారు. దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించిన పోలీసులు, ఐదుగురు నిందితుల ఫోటోలను గుర్తించి వాటిని విడుదల చేశారు. నిందితుల జాడ కనిపెట్టిన వారికి లేదా వారి గురించి కచ్చితమైన సమాచారం అందించిన వారికి రూ. 1,00,000 (లక్ష రూపాయలు) బహుమతిగా అందజేస్తామని పోలీసులు ప్రకటించారు.
నిందితులు పక్క రాష్ట్రాలకు పారిపోకుండా సరిహద్దుల వద్ద తనిఖీలు చేపడుతున్నారు. కరీంనగర్ నగరం చుట్టుపక్కల ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పోలీసులు విడుదల చేసిన ఫోటోల్లోని వ్యక్తులు మీకు ఎక్కడైనా కనిపిస్తే, వెంటనే స్థానిక పోలీసులకు లేదా 100 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
అసలు ఏం జరిగిందంటే?
ఆదివారం ఉదయం కరీంనగర్‌లోని జ్యోతినగర్ పీఎంజీ (PMG) జ్యువెల్లరీ షాపు వద్దకు ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు బైకులపై వచ్చారు. తొలుత కస్టమర్లలా నటిస్తూ లోపలికి ప్రవేశించిన నిందితులు, సిబ్బందిని నగలు చూపించాల్సిందిగా కోరారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో ఒక్కసారిగా తుపాకులు బయటకు తీసి సిబ్బందిని బెదిరించారు.
షాపు సిబ్బంది ప్రతిఘటించడంతో దుండగులు కర్కశంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఇతర సిబ్బంది వారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. కాల్పుల అనంతరం దుండగులు విలువైన నగలతో అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. జ్యువెల్లరీ షాపు సిబ్బందిని దుండగులు బెదిరిస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఇవి వైరల్ అయ్యాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


