Karimnagar : ఎస్ఐ ఆత్మహత్య - 4 రోజుల క్రితమే భార్య కూడా సూసైడ్..! అనాథలుగా చిన్నారులు

Karimnagar SI Suicide : కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్య చేేసుకున్నాడు. నాలుగు రోజుల క్రితం ఆయన భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మృతిని తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 

Published on: Mar 21, 2026, 12:28:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కరీంనగర్ టౌన్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. టూ టౌన్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న చంద్రశేఖర్ అత్తగారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు రోజులక్రితం ఆయన భార్య దివ్య పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది. ఆమె దశదిన కర్మల కోసం అత్తగారింటికి వెళ్లిన చంద్రశేఖర్… ఈ దారుణానికి ఒడిగట్టాడు.

భార్య దివ్యతో ఎస్సై చంద్రశేఖర్ (ఫైల్ ఫొటో)
భార్య దివ్యతో ఎస్సై చంద్రశేఖర్ (ఫైల్ ఫొటో)

ఇటీవలనే భార్య సూసైడ్…!

గత నాలుగు రోజుల క్రితం చంద్రశేఖర్ భార్య దివ్య… గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత దివ్య మృతదేహాన్ని స్వగ్రామం ఇల్లందకుంట మండలం సీతంపేటకు తరలించారు. సీతంపేట గ్రామంలో దివ్య ఆత్మహత్యకు భర్త చంద్రశేఖర్ కారణమని ఆరోపించారు. ఓ దశలో దాడికి ప్రయత్నించినట్లు తెలిసింది. గ్రామస్తులు, బంధువుల నిరసనల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఇవాళ ఐదు రోజుల కార్యక్రమానికి అత్తగారింటికి వచ్చిన చంద్రశేఖర్…. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గదిలో నుంచి బయటికి రాకపోవడంతో అనుమానంతో చూడగా ఉరి వేసుకొని ఉండడంతో జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తల్లిదండ్రుల మరణాలతో వారి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.

ఒత్తిడితోనేనా…?

భార్య మృతి చెందటతో చంద్రశేఖర్ మానసిక కుంగుబాటుకు లోనైనట్లు తెలుస్తోంది. దీనికితోడు భార్య మృతికి భర్తే కారణమని బంధువులు ఆరోపించడంతో తీవ్ర ఒత్తిడికి లోనై ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More