కరీంనగర్ జిల్లాలో మానవత్వం మంటగలిసే దారుణ ఘటన వెలుగుచూసింది. రెక్కాడితే గాని డొక్కాడని ఒక పేద మహిళను నమ్మించి, కూలీ పని ఇప్పిస్తానని తీసుకెళ్లిన ఒక గుర్తుతెలియని దుండగుడు ఆమెపై కిడ్నాప్, దారిదోపిడీ, హత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఆమె వద్ద ఉన్న కాస్త బంగారం, నగదును లాక్కుని, సాక్ష్యం లేకుండా చేయాలనే క్రూర ఉద్దేశంతో బావిలోకి తోసేసి పారిపోయాడు. అయితే, ఆ మహిళ అపారమైన మనోధైర్యంతో ఏకంగా 21 గంటల పాటు మృత్యువుతో పోరాడి…. ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది.
ఏం జరిగిందంటే..?

వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కిసాన్ నగర్‌కు చెందిన గంగాధర లక్ష్మి (55) అనే మహిళ ప్రతిరోజూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఎప్పటిలాగే జూలై 1వ తేదీన సదరు మహిళను ఆమె కొడుకు సందీప్ స్థానిక కూలి అడ్డా వద్ద దించి తన పని నిమిత్తం వెళ్లిపోయాడు. ఆ సమయంలో కూలి అడ్డా వద్దకు వచ్చిన ఒక అపరిచిత వ్యక్తి, తనకు కూలీలు కావాలని, మంచి పని ఇప్పిస్తానని లక్ష్మితో ఒప్పందం చేసుకున్నాడు. అతని మాటలు నమ్మిన ఆమె, ఆ వ్యక్తితో కలిసి బయలుదేరింది.
ఆ దుండగుడు లక్ష్మిని నుస్తులాపూర్ గ్రామ శివారుల్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టి…. లక్ష్మిని బెదిరించి ఆమె వద్ద ఉన్న బంగారం, కొంత నగదును బలవంతంగా లాక్కున్నాడు. అంతటితో ఆగకుండా,,,, ఆమె పోలీసులకు చెప్తుందనే భయంతో పక్కనే ఉన్న ఒక వ్యవసాయ బావిలోకి దారుణంగా తోసేశాడు.
బావిలో పడిన లక్ష్మి ఎలాగోలా అక్కడ ఉన్న ఒక తాడును పట్టుకుని పైకి రావడానికి ప్రయత్నించింది. కానీ…. అది గమనించిన దుండగుడు… పైకి రాకుండా ఆ తాడును కూడా కత్తితో కోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ నిస్సహాయ స్థితిలోనూ ధైర్యం కోల్పోని లక్ష్మి బావిలో ఈదుకుంటూ, అక్కడ మోటారుకు అమర్చి ఉన్న పైపు, వైర్ ను గట్టిగా పట్టుకుని ప్రాణాలు కాపాడుకుంటూ బావిలోనే ఉండిపోయింది.
మరోవైపు రాత్రి అవుతున్నా తల్లి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కొడుకు సందీప్ వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు లక్ష్మి సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. లొకేషన్ నుస్తులాపూర్ గ్రామం చూపిస్తుండటంతో రాత్రంతా ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టి గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు.
{{/usCountry}}మరోవైపు రాత్రి అవుతున్నా తల్లి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కొడుకు సందీప్ వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు లక్ష్మి సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. లొకేషన్ నుస్తులాపూర్ గ్రామం చూపిస్తుండటంతో రాత్రంతా ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టి గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు.
{{/usCountry}}మరుసటి రోజు ఉదయం దాదాపు 7 గంటల సమయంలో సదరు బావి వద్దకు వచ్చిన భూ యజమానికి బావి లోపలి నుంచి దీనంగా వినపడుతున్న కేకలు లీలగా వినిపించాయి. వెంటనే అతను పరిశీలించగా బావిలో మహిళ కనిపించడంతో గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులందరూ కలిసి తాళ్ల సహాయంతో లక్ష్మిని సురక్షితంగా బయటకు తీశారు. దాదాపు 21 గంటల పాటు బావిలోనే ప్రాణాల కోసం పోరాడిన లక్ష్మి సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కేసును చేధించిన పోలీసులు…
సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు సవాల్ గా తీసుకున్నారు. అత్యంత చాకచక్యంగా ఛేదించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుల కదలికలను కనిపెట్టి…. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను శనివారం కరీంనగర్ సీపీ సీపీ గౌస్ ఆలం వెల్లడించారు.ఈ కేసులో నిందితుడైన దమ్మ దినేశ్ రెడ్డి(21)ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
సీపీ తెలిపిన వివరాల ప్రకారం…..నిందితుడు డియువిన్ , జియో లాటరీ వంటి ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, కలర్ ట్రేడింగ్ గేమ్స్‌కు బానిసై సుమారు రూ.4 లక్షలు నష్టపోయాడు. అదనంగా పలు లోన్ యాప్‌ల ద్వారా అప్పులు తీసుకుని వసూళ్ల ఒత్తిడిని ఎదుర్కొంటుండటంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ నేరానికి పథకం రచించాడు. నేరానికి వారం రోజుల ముందే నగరంలోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించిన నిందితుడు, జులై 1న టవర్ సర్కిల్ లేబర్ అడ్డా వద్ద ఒంటరిగా ఉన్న బాధితురాలిని లక్ష్యంగా ఎంచుకున్నాడు.
నిందితుడు దోపిడీ చేసిన ఐదు గ్రాముల బంగారు ఆభరణాలు, 20 గ్రాముల వెండి మెట్టెలు కరీంనగర్ టవర్ సర్కిల్‌లోని ఓ నగల వ్యాపారికి 30,000 రూపాయలకు విక్రయించినట్టు గుర్తించారు. దోపిడీ సొత్తుతో పాటు 5 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.