కేసీఆర్ సిట్ విచారణ.. పోలీసులకు ఇంటెలిజెన్స్ చీఫ్ మెసేజ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. దీంతో బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. మరోవైపు పోలీసులకు ఇంటెలిజెన్స్ చీఫ్ అలర్ట్ మెసేజ్ పంపించారు.

Published on: Feb 1, 2026, 15:07:59 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ విచారణ చేస్తోంది. నందినగర్‌లోని ఆయన నివాసానికి పిలిపించింది. దీంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. నిఘా నివేదికల ప్రకారం.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నందినగర్‌లో, రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాలలో పెద్ద సమావేశాలు, నిరసనలు నిర్వహించవచ్చవచ్చు.

కేసీఆర్ సిట్ విచారణ
కేసీఆర్ సిట్ విచారణ

ఇంటెలిజెన్స్ చీఫ్... కమిషనర్లు, ఎస్పీలకు అలర్ట్ మెసేజ్ జారీ చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చెపట్టే అవకాశం ఉందని, తగిన ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశారు వెళ్లాయి. కేసీఆర్ విచారణ పూర్తయ్యే వరకు అంతటా అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద పరిస్థితులపై వెంటనే స్పందించాలని ఇంటెలిజెన్స్ చీఫ్ హెచ్చరికలు జారీ చేశారు.

ర్యాలీలు, ధర్నాలు, రోడ్డు దిగ్బంధనాలు, దిష్టిబొమ్మల దహనం ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇవి ప్రజా శాంతికి అంతరాయం కలిగించే అవకాశం ఉందని పోలీసులకు మెసేజ్ వెళ్లింది. ముఖ్యంగా రాబోయే మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇంటెలిజెన్స చీఫ్ సందేశం పంపారు.

ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం కేసీఆర్‌ను బంజారాహిల్స్‌లోని నందినగర్‌లోని ఆయన నివాసంలో ప్రశ్నించడం ప్రారంభించింది. న్యాయ నిపుణులతో తయారు చేసిన ప్రశ్నలతో సిట్ బృందం షెడ్యూల్ చేసిన సమయానికి కొన్ని నిమిషాల ముందు కేసీఆర్ ఇంటికి వచ్చి మధ్యాహ్నం 3 గంటల నుండి విచారణ ప్రారంభించింది.

సిట్ విచారణకు హాజరు కావడానికి కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్ నుండి నందినగర్ నివాసానికి మధ్యాహ్నం వచ్చారు. శుక్రవారం ఆయనకు జారీ చేసిన నోటీసుకు ప్రతిస్పందనగా ఆయన విచారణకు హాజరయ్యారు. సిట్ విచారణ, అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి హైదరాబాద్ పోలీసులు నందినగర్, దాని పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

నందినగర్‌కు ఇతరుల రాకపోకలను నియంత్రించడానికి బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. నగరంలో అలజడి సృష్టించే ప్రయత్నాలను తిప్పికొట్టడానికి బీఆర్ఎస్ ముఖ్య నాయకులపై నిఘా ఉంచారు. బంజారాహిల్స్, పరిసర ప్రాంతాలలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More