హైదరాబాద్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు బ్రేక్ పడింది. ఖైరతాబాద్ నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై తుది తీర్పు వచ్చేంత వరకు ఆ స్థానానికి ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయబోమని హైకోర్టుకు వెల్లడించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం తరఫున నిలిచిన స్టాండింగ్ కౌన్సెల్ అవినాష్ దేశాయ్, ధర్మాసనానికి కమిషన్ స్పష్టమైన వైఖరిని తెలియజేశారు.

గతంలో కార్పొరేటర్‌గా పనిచేసిన విజయారెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని కోర్టు ముందుకు తీసుకొచ్చింది. ఖైరతాబాద్ స్థానానికి ఉపఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈసీఐని ఆదేశించాలంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పి. విజయారెడ్డి, బిఆర్‌ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ చేతిలో ఓటమి పాలయ్యారు. దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ, ఆయన ఎన్నికను సవాలు చేస్తూ విజయారెడ్డి అప్పట్లోనే హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేశారు. రకరకాల ఆధారాలను చూపిస్తూ నాగేందర్ ఎన్నికను రద్దు చేసి, తనను విజేతగా ప్రకటించాలని కోరారు.
ఎన్నికల అనంతరం దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి మారారు. ఆ తర్వాత జరిగిన సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఫిరాయింపుల వ్యవహారంపై బీఆర్‌ఎస్ వేసిన రిట్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఇటీవలే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసింది. ఆ నియోజకవర్గాన్ని ఖాళీగా ప్రకటిస్తూ అసెంబ్లీ సెక్రటేరియట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న విజయారెడ్డి, ఖైరతాబాద్ ఉపఎన్నిక నిలిపివేయాలని కోరుతూ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్షన్ పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు, ఆ స్థానాన్ని సాధారణ ఖాళీగా పరిగణించడానికి వీలులేదని స్పష్టం చేశారు.
{{/usCountry}}ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న విజయారెడ్డి, ఖైరతాబాద్ ఉపఎన్నిక నిలిపివేయాలని కోరుతూ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్షన్ పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు, ఆ స్థానాన్ని సాధారణ ఖాళీగా పరిగణించడానికి వీలులేదని స్పష్టం చేశారు.
{{/usCountry}}తన వాదనలకు బలం చేకూర్చేలా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు కీలక తీర్పులను కోర్టు దృష్టికి తెచ్చారు. 'ప్రజా ప్రాతినిధ్య చట్టం - 1951'లోని సెక్షన్ 84 మరియు సెక్షన్ 98 (సి) నిబంధనలను ఆయన ఉటంకించారు. ఎలక్షన్ పిటిషన్ తేలేవరకు సదరు నియోజకవర్గానికి బై ఎలక్షన్ నిర్వహించే అధికారం ఈసీఐకి లేదని కోర్టుకు విన్నవించారు.
ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్, ఈసీఐ తరఫు న్యాయవాదుల వాదనలను విన్న ధర్మాసనం.. ఈ అంశంపై తమ పూర్తిస్థాయి వైఖరిని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వాయిదా వేసింది.