TG MLC Elections : తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు - కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు! ఈసారి ఎవరంటే..?

Telangana MLC Elections 2026 : తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినాయకత్వం ప్రకటన విడుదల చేసింది.

Published on: Sep 30, 2026, 00:01:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Telangana MLC Elections 2026 : తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రెండు కీలక పట్టభద్రుల స్థానాలకు పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. ఈ అభ్యర్థుల ఎంపికకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తుది ఆమోదం తెలిపారు.

కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు
కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు

అభ్యర్థులు వీరే…

  • మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం: ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అధికారిక అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డి పోటీ చేయనున్నారు.
  • నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం: విద్యార్థులు, యువత, నిరుద్యోగుల పోరాటాలకు కీలక కేంద్రమైన ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి బరిలోకి దిగనున్నారు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఢిల్లీలో విడుదల చేశారు. హైదరాబాద్ తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధితో పాటు ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలను కవర్ చేసే ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగుల ఓట్లే గెలుపోటములను శాసించే అవకాశం ఉండటంత…., బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

గత ఎన్నికల్లో ఈ రెండు స్థానాల్లో ఓడిపోయిన కాంగ్రెస్… ఈసారి మాత్రం విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని భావిస్తోంది. ఈ స్థానాల్లో గెలవటం ద్వారా శాసనమండలిలో తమ బలాన్ని పెంచుకోవటమే కాకుండా… ప్రతిపక్షాలకు బలమైన సందేశాన్ని పంపాలనుకుంటోంది. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ అధినాయకత్వం…. ప్రచార ప్రణాళికలను కూడా త్వరలోనే సిద్ధం చేసి క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More