సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామాకు డిమాండ్.. హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో నిరసన ర్యాలీ చేపట్టారు.

Published on: Sep 28, 2026, 13:07:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌ వేదికగా కాంగ్రెస్ శ్రేణులు సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో తీవ్ర అక్రమాలు, లోపాలు చోటుచేసుకున్నాయని, వీటన్నింటికీ ఈసీ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యింది.

కాంగ్రెస్ నిరసన ర్యాలీ
కాంగ్రెస్ నిరసన ర్యాలీ

హైదరాబాద్ డీసీసీ అధ్యక్షులు మోతా రోహిత్, దీపక్ జాన్ ల నేతృత్వంలో నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సమకూరారు. అనంతరం అక్కడి నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వరకు భారీ ర్యాలీగా బయలుదేరారు.

ఈ నిరసన ప్రదర్శనలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్‌‌తోపాటుగా ఇతర ముఖ్య నేతలు భాగస్వాములయ్యారు. ర్యాలీ పొడవునా కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు హోరెత్తించేలా నినాదాలు చేశారు.

ఓటర్ల జాబితా సవరణలో జరిగిన లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణ, సమగ్ర ఎన్నికల నిర్వహణ విధానంలో స్పష్టత, పారదర్శకతను కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేయాలన్నారు.

అర్హులైన ఓటర్ల పేర్లు గాల్లో కలవడంపై ఈసీ తగిన వివరణ ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో లోపాలకు బాధ్యత వహిస్తూ.. రాజీనామా చేయాలన్నారు. ఈ మేరకు నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More