...
...
Next Story

ఖమ్మం DMHOలో 99 ఉద్యోగ ఖాళీలు - దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ వివరాలివే

ఖమ్మం జిల్లా డీఎంహెచ్ వో పరిధిలో నేషనల్ హెల్త్ మిషన్ కింద 99 కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 13 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

Published on: Oct 10, 2026, 15:52:26 IST
Advertisement

హెల్త్ అండ్ పారామెడికల్ రంగానికి చెందిన నిరుద్యోగులకు శుభువార్త వచ్చేసింది. నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద ఖమ్మం జిల్లా పరిధిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 99 మెడికల్, పారామెడికల్, ఇతర సిబ్బంది పోస్టుల భర్తీకి వైద్యారోగ్యశాఖ దరఖాస్తులను స్వీకరిస్తోంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తారు.

ఖమ్మం DMHOలో 99 ఉద్యోగ ఖాళీలు ( image source Pixel)
ఖమ్మం DMHOలో 99 ఉద్యోగ ఖాళీలు ( image source Pixel)

ఈ ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధించి ఖమ్మం జిల్లా వైద్యాధికారి కార్యాలయం నుంచి నోటిఫికేషన్ జారీ కాగా… ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 13, 2026 సాయంత్రం 5:00 గంటలలోపు తమ దరఖాస్తులను స్వయంగా గానీ, లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా గానీ అందజేయాలి.

ఖాళీలు - జీతం వివరాలు :

  • ఓబీజీ స్పెషలిస్ట్ : 1 పోస్టు (రూ. 1,00,000)
  • అనస్థీటిస్ట్ : 1 పోస్టు (రూ. 1,00,000)
  • యూరాలజిస్ట్ (Urologist): 1 పోస్టు (రూ. 1,00,000)
  • పాథాలజిస్ట్ (Pathologist): 1 పోస్టు (రూ. 1,00,000)
  • పీడియాట్రీషియన్ (Pediatrician): 2 పోస్టులు (రూ. 1,00,000)
  • ఫిజీషియన్స్ : 2 పోస్టులు (రూ. 52,000 నుంచి రూ. 72,850)
  • జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (GDMOs): 1 పోస్టు (రూ. 52,000)
  • పల్లె దవాఖాన - MLHP/CHO/MO: 36 పోస్టులు (రూ. 40,000)
  • సీనియర్ డాట్స్ ప్లస్ టీబీ హెచ్‌ఐవీ సూపర్‌వైజర్: 1 పోస్టు (రూ. 33,750)
  • స్టాఫ్ నర్స్ / నర్సింగ్ ఆఫీసర్స్: 24 పోస్టులు (రూ. 29,900)
  • ఏఎన్‌ఎం (ANM) / 2వ ఏఎన్‌ఎం: 11 పోస్టులు (రూ. 27,300)
  • ల్యాబ్ టెక్నీషియన్ : 14 పోస్టులు (రూ. 27,300)
  • ఫార్మాసిస్ట్ : 03 పోస్టులు (రూ. 27,300)
  • సైకాలజిస్ట్ : 1 పోస్టు (రూ. 22,750)

అభ్యర్థులు జిల్లా అధికారిక వెబ్‌సైట్ https://khammam.telangana.gov.in నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్‌కు అవసరమైన సర్టిఫికెట్ల నకళ్లను, అలాగే నిర్ణీత ఫీజు డీడీని జతచేసి "District Medical & Health Office, F1, I.D.O.C, V. వెంకటయ్యపాలెం, ఖమ్మం" చిరునామాకు అక్టోబర్ 13 సాయంత్రం 5 గంటలలోగా అందజేయాలి. డిమాండ్ డ్రాఫ్ట్ (DD) ను "District Medical & Health Officer, Khammam" పేరిట ఖమ్మంలో చెల్లించేలా తీయాల్సి ఉంటుంది.

అభ్యర్థుల ఎంపికను కేవలం మెరిట్ ప్రాతిపదికన 100 మార్కులకు లెక్కిస్తారు. అభ్యర్థులు సాధించిన అర్హత పరీక్ష మార్కులకు 90 శాతం వెయిటేజీ కేటాయిస్తారు. మిగిలిన 10 మార్కులను అభ్యర్థి వయస్సు ఆధారంగా (18 ఏళ్లు పూర్తయిన ప్రతి సంవత్సరానికి 0.5 మార్కుల చొప్పున గరిష్టంగా 10 మార్కులు) ఇస్తారు. నిబంధనల ప్రకారం రోస్టర్ విధానం, స్థానికత, ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్ నిబంధనలను అనుసరించి అభ్యర్థుల తుది జాబితాను రూపొందిస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks