కైండ్ ఇండియా సంస్థ తన కొత్త ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ KindIndia.in ను ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వెరిఫైడ్ ఎన్జీఓలు, దాతలను ఒకే వేదికపైకి తీసురానుంది. భారతీయ సమాజంలో అతిముఖ్యమైన దయ, దాతృత్వ విలువలను తిరిగి ప్రోత్సహించడమే లక్ష్యంగా రూపొందించబడింది.

కేవలం రూ.100 నుంచి మొదలయ్యే విరాళాలతో…. “100 రూపాయల చారిటీ రెవల్యూషన్” అనే కొత్త ఉద్యమానికి కైండ్ ఇండియా నాంది పలుకుతోంది. దీని ద్వారా కేవలం రూ. 100 తోనే దాతృత్వంలో భాగస్వామ్యం అవ్వొచ్చు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఆలయాలు, విద్యాసంస్థలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు వంటి విభిన్న రంగాలకు చెందిన ఎన్జీఓలను ఏకతాటిపైకి తీసుకువస్తూ కైండ్ ఇండియా చారిటీని అందరి దైనందిన జీవితంలో భాగంచేయాలనేదే దీని ప్రధాన ఉద్దేశ్యం.
“మనం ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్స్ లో ఎంత ఉత్సాహంగా పాల్గొంటామో, అంతే ఉత్సాహంతో అవసరమైనవారి గురించి కూడా ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం,” అని కైండ్ ఇండియా ప్రతినిధి తెలిపారు. “పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, పండుగలు — వేడుక ఏదైనా, మీరు చేసే చిన్న సహాయం మీ సంతోషాన్ని రెట్టింపు చేసుకునే అవకాశంగా మార్చుకోవాలి" అని అన్నారు.
దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ప్రచారాలు నిర్వహించడం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు కొందరినైనా ఉత్తేజితం చేసి మరికొంతమందిని ఈ మార్గంలో నడిపిస్తుంది. ఈ చిన్న పని ద్వారా మీరు ఆనందం పొందడంతోపాటు ఒకరి సంతోషానికి….మరొకరి మొహం మీద చిరునవ్వుకు కూడా కారణం కావొచ్చు.
దాతృత్వం అనేది కేవలం డబ్బు గురించే కాదు.. అది పంచుకోవడం, పరస్పర సహాయ సహకారాలను అందించుకోవడం ద్వారా సమాజంపై సానుకూల ప్రభావం సృష్టించడం గురించినది. భారతీయ సమాజం చారిత్రాత్మకంగా ఈ గుణాలకు పెట్టింది పేరు. కర్ణుడు (“దాన కర్ణుడు”) నుండి బలి చక్రవర్తి వరకు, మన సంస్కృతి దాతృత్వంతో నిండిపోయి ఉంది. సమాజంలో ఈ గుణాలను తట్టిలేపి దేశాన్ని ఈ దశలోనే ప్రయాణింపజేయాలని కైండ్ ఇండియా తపిస్తోంది. .
కైండ్ ఇండియా గురించి…!
కైండ్‌నెస్ ను సామాజిక అలవాటుగా మార్చాలనే లక్ష్యంతో KindIndia.in ఏర్పడింది. దాతలను, ఎన్జీఓలను ఒకేతాటిపైకి తీసుకొచ్చి సమాజంలో కైండ్‌నెస్ ను ప్రోత్సహించే వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ…. ఈ ఫౌండేషన్ చారిటీని మన జీవన విధానంగా మార్చిలని సంకల్పిస్తోంది.
{{/usCountry}}కైండ్‌నెస్ ను సామాజిక అలవాటుగా మార్చాలనే లక్ష్యంతో KindIndia.in ఏర్పడింది. దాతలను, ఎన్జీఓలను ఒకేతాటిపైకి తీసుకొచ్చి సమాజంలో కైండ్‌నెస్ ను ప్రోత్సహించే వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ…. ఈ ఫౌండేషన్ చారిటీని మన జీవన విధానంగా మార్చిలని సంకల్పిస్తోంది.
{{/usCountry}}