రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సును కంకర టిప్పర్ ఢీకొట్టింది. రహదారిపై గుంతను తప్పించబోయి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో 19 మంది మృతి చెందగా చాలా మందికి గాయాలు అయ్యాయి. వేర్వేరు ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు ఆర్టీసీ బస్సు- టిప్పర్ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సు కండక్టర్ రాధా ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు. టిప్పర్ డ్రైవర్ ఆకాశ్‌పై కేసు నమోదు అయింది. చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ మహారాష్ట్రకు చెందిన కమలే ఆకాశ్‌గా గుర్తించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన లచ్చానాయక్ వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పటాన్‌చెరులోని క్రషర్ మిల్లు నుంచి వికారాబాద్‌కు కంకర సరఫరా చేస్తున్నాడు.
చేవెళ్ల ప్రభుత్వాస్పత్రిలో శవపరీక్షలు జరిగాయి. చేవెళ్ల ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాలకు శవపరీక్షలు పూర్తి చేశారు. శవపరీక్షలు పూర్తయిన మృతదేహాలు బంధువులకు అప్పగించారు. మృతుల్లో మొత్తం 15 మందిని గుర్తించారు. మరో 4 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. శవపరీక్షల అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు.
చనిపోయిన వారి వివరాలు
వికారాబాద్ జిల్లాకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ దస్తగిరిబాబా (35), ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన టిప్పర్ డ్రైవర్ కమలే ఆకాశ్ మృతి చెందారు. ప్రయాణికుల్లో వికారాబాద్ శ్రీరామ్‌నగర్ తండా వాసి తారాబాయ్ (45), హైదరాబాద్ బోరబండకు చెందిన కల్పన (45), భానూరుకు చెందిన బచ్చన్ నాగమణి (55), దౌల్తాబాద్ మండలానికి చెందిన మల్లగండ్ల హనుమంతు (35), యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌కు చెందిన అఖిల రెడ్డి (22), హైదరాబాద్ బోరబండకు చెందిన గోగుల గుణమ్మ (60), తాండూరుకు చెందిన షేక్ ఖలాద్ హుస్సేన్ (76), తాండూరు వాసులు తాబస్సుమ్ జహాన్ (38), తాలియా బేగం, తాండూరుకు చెందిన సాయిప్రియ, నందిని (18), తనూష అక్కాచెల్లెల్లు మరణించారు.
కోఠి కళాశాలలో చదువుతున్న తాండూరుకు చెందిన ముస్కాన్ (21), యాలాల మండలం హాజీపురాకు చెందిన బండప్ప (42), పది నెలల చిన్నారి కూడా ఈ ప్రమాదం మృతి చెందారు. చేవెళ్ల ప్రమాదంలో బండప్ప దంపతులు చనిపోయారు. తల్లిదండ్రుల మృతితో భవాని, శివలీల అనాథలుగా మారారు.
రూ.7 లక్షల ఆర్థిక సాయం
{{/usCountry}}కోఠి కళాశాలలో చదువుతున్న తాండూరుకు చెందిన ముస్కాన్ (21), యాలాల మండలం హాజీపురాకు చెందిన బండప్ప (42), పది నెలల చిన్నారి కూడా ఈ ప్రమాదం మృతి చెందారు. చేవెళ్ల ప్రమాదంలో బండప్ప దంపతులు చనిపోయారు. తల్లిదండ్రుల మృతితో భవాని, శివలీల అనాథలుగా మారారు.
రూ.7 లక్షల ఆర్థిక సాయం
{{/usCountry}}చేవెళ్ల ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం అందించనున్నట్టుగా మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, ఆర్టీసీ తరఫున రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్టుగా వెల్లడించారు. మరోవైపు క్షతగాత్రులను పలువురు మంత్రులు పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.