చేవెళ్ల బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు.. ఆర్టీసీ నుంచి రూ.2లక్షలు ఆర్థిక సాయం!

రంగారెడ్డి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కొన్ని మృతదేహాలను గుర్తించారు. మరోవైపు టిప్పర్ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Published on: Nov 3, 2025, 17:32:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సును కంకర టిప్పర్‌ ఢీకొట్టింది. రహదారిపై గుంతను తప్పించబోయి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో 19 మంది మృతి చెందగా చాలా మందికి గాయాలు అయ్యాయి. వేర్వేరు ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెలు మృతి
ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెలు మృతి

మరోవైపు ఆర్టీసీ బస్సు- టిప్పర్‌ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సు కండక్టర్ రాధా ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు. టిప్పర్ డ్రైవర్ ఆకాశ్‌పై కేసు నమోదు అయింది. చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ మహారాష్ట్రకు చెందిన కమలే ఆకాశ్‌గా గుర్తించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన లచ్చానాయక్ వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పటాన్‌చెరులోని క్రషర్ మిల్లు నుంచి వికారాబాద్‌కు కంకర సరఫరా చేస్తున్నాడు.

చేవెళ్ల ప్రభుత్వాస్పత్రిలో శవపరీక్షలు జరిగాయి. చేవెళ్ల ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాలకు శవపరీక్షలు పూర్తి చేశారు. శవపరీక్షలు పూర్తయిన మృతదేహాలు బంధువులకు అప్పగించారు. మృతుల్లో మొత్తం 15 మందిని గుర్తించారు. మరో 4 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. శవపరీక్షల అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు.

చనిపోయిన వారి వివరాలు

వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ దస్తగిరిబాబా (35), ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన టిప్పర్‌ డ్రైవర్‌ కమలే ఆకాశ్‌ మృతి చెందారు. ప్రయాణికుల్లో వికారాబాద్‌ శ్రీరామ్‌నగర్‌ తండా వాసి తారాబాయ్ (45), హైదరాబాద్‌ బోరబండకు చెందిన కల్పన (45), భానూరుకు చెందిన బచ్చన్‌ నాగమణి (55), దౌల్తాబాద్ మండలానికి చెందిన మల్లగండ్ల హనుమంతు (35), యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌కు చెందిన అఖిల రెడ్డి (22), హైదరాబాద్‌ బోరబండకు చెందిన గోగుల గుణమ్మ (60), తాండూరుకు చెందిన షేక్‌ ఖలాద్‌ హుస్సేన్‌ (76), తాండూరు వాసులు తాబస్సుమ్‌ జహాన్‌ (38), తాలియా బేగం, తాండూరుకు చెందిన సాయిప్రియ, నందిని (18), తనూష అక్కాచెల్లెల్లు మరణించారు.

కోఠి కళాశాలలో చదువుతున్న తాండూరుకు చెందిన ముస్కాన్‌ (21), యాలాల మండలం హాజీపురాకు చెందిన బండప్ప (42), పది నెలల చిన్నారి కూడా ఈ ప్రమాదం మృతి చెందారు. చేవెళ్ల ప్రమాదంలో బండప్ప దంపతులు చనిపోయారు. తల్లిదండ్రుల మృతితో భవాని, శివలీల అనాథలుగా మారారు.

రూ.7 లక్షల ఆర్థిక సాయం

చేవెళ్ల ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం అందించనున్నట్టుగా మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, ఆర్టీసీ తరఫున రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్టుగా వెల్లడించారు. మరోవైపు క్షతగాత్రులను పలువురు మంత్రులు పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More