KNRUHS MBBS Allotment : ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల - అలాట్ మెంట్ లింక్, రిపోర్టింగ్ తేదీలివే

KNRUHS MBBS Allotment : తెలంగాణలో 2026-27 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఫలితాలను విడుదల చేసింది.

Published on: Sep 4, 2026, 11:57:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

KNRUHS MBBS Allotment : రాష్ట్రంలో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల తొలి విడత కేటాయింపు ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం వివరాలను వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు నాన్-మైనారిటీ, మైనారిటీ మెడికల్ కాలేజీలలో కన్వీనర్ కోటా కింద మొత్తం 3,366 మంది విద్యార్థులకు ఈ తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయించారు.

ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల సీట్ల కేటాయింపు (image source pixabay)
ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల సీట్ల కేటాయింపు (image source pixabay)

ఈ సారి కూడా నీట్ (NEET) టాప్ ర్యాంకర్లు అత్యధికంగా సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీ, హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. నీట్ ఆల్ ఇండియా 83వ ర్యాంకు సాధించిన కొంపెల్ల సాయి గాయత్రి తేజోఅరుణిమ సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో ఓపెన్ కేటగిరీ కింద ప్రవేశం పొంది తెలంగాణ టాపర్‌గా నిలిచారు.

సెప్టెంబర్ 8 లోపు రిపోర్టింగ్ తప్పనిసరి

కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులంతా వెంటనే తమ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ ( https://www.knruhs.telangana.gov.in/ ) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని KNRUHS స్పష్టం చేసింది. సంబంధిత యూనివర్సిటీ, కళాశాల ట్యూషన్ ఫీజులను చెల్లించడంతో పాటు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కేటాయించిన కళాశాల ప్రిన్సిపాల్ వద్ద సెప్టెంబర్ 8వ తేదీ సాయంత్రం 4:00 గంటలలోపు రిపోర్ట్ చేసి ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని వర్సిటీ ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయని అభ్యర్థుల సీట్లు రద్దవుతాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More