జూబ్లీహిల్స్ ఓటర్లు పంచ్ కొడితే ఆ దెబ్బ కాంగ్రెస్ హైకమాండ్‌కు తగలాలి : కేటీఆర్
జూబ్లీహిల్స్‌లో ఓటర్లు పంచ్ కొడితే ఆ దెబ్బ కాంగ్రెస్ హైకమాండ్‌కు తగలాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కారు కావాలా? బుల్డోజర్ కావాలా? అనే విషయాన్ని ఓటర్లు తేల్చుకోవాలన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధి రహమత్‌నగర్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్, హరీశ్ రావుతోపాటుగా బీఆర్ఎస్ కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి అసభ్యంగా మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు. పేగులు మెడలో వేసుకుంటానని ఎప్పుడూ అంటుంటారని, ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడూ చూడలేదన్నారు. గతంలో కాంగ్రెస్ తరఫున జూబ్లీహిల్స్ నుంచి అజారుద్దీన్ పోటీ చేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఇస్తానని ఆయనను పక్కనపెట్టారన్నారు. జుబ్లీహిల్స్ ఓటర్లు పంచ్ కొడితే ఆ దెబ్బ కాంగ్రెస్ హైకమాండ్‌కు తగలాలి అని పిలుపునిచ్చారు. కారు కావాలా? బుల్డోజర్ కావాలా? అనేది ఓటర్లు తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ నేతలు ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు చేర్చారని తెలిపారు. అలాంటివి ఎదుర్కోవడంపై పార్టీ పరంగా దృష్టి సారించామన్నారు.
'ఒక్కొక్కరికి కాంగ్రెస్ ఎంత బాకీ పడిందో గుర్తించాలి. ప్రతి వ్యక్తిని కలిసి బాకీ కార్డు ఇవ్వాలి. కాంగ్రెస్‌ను హైదారాబాదీలు నమ్మలేదు. ఎన్నికల్లో అందుకే ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఇండ్లను కూలగొట్టడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? రేవంత్ రెడ్డి మాదిరి గలీజ్ భాష మాట్లాడే ముఖ్యమంత్రి దేశంలోలే లేరు.' అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్‌ను ఓడిస్తేనే ఆరు గ్యారంటీలు అమలు : హరీశ్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణకు అత్యంత అవినీతి రాష్ట్రంగా మార్చేశారని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మండిపడ్డారు. ఎలాంటి పని జరగాలి అనుకున్నా.. కాంగ్రెస్ నేతలు కమీషన్లు అడుగుతున్నారన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే ఆరు గ్యారంటీలు అమలవుతాయన్నారు. తన హయాంలో పేదల కోసం బస్తీ దవఖానాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అక్కడ పనిచేసే వైద్యులు, సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదన్నారు. మందులు కూడా ఉండటం లేదని పేర్కొన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లే కూలుస్తున్నారన్నారు. పెద్దలవి కూల్చడం లేదని చెప్పారు.
మాగంటి సునీత భావోద్వేగం
ఈ సమావేశంలో ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత భావోద్వేగానికి గురయ్యారు. దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ను తలుచుకుని కన్నీంటి పర్యంతమయ్యారు. గోపినాథ్ ఆశాయలను ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. తన తండ్రి గోపీనాథ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని గోపీనాథ్ కుమార్తె అక్షర అన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


