కరీంనగర్ : శాతవాహన వర్సిటీ హాస్టల్‌లో లా విద్యార్థిని ఆత్మహత్య..!
కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ లా కాలేజీ మహిళా హాస్టల్‌లో విషాదం చోటుచేసుకుంది. మూడో సెమిస్టర్ చదువుతున్న దక్కలి చంద్రకళ (30) అనే లా విద్యార్థిని తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.
కరీంనగర్‌లోని ప్రముఖ శాతవాహన యూనివర్సిటీ న్యాయ కళాశాల (లా కాలేజీ) మహిళా హాస్టల్‌లో ఆదివారం విషాదం వెలుగుచూసింది. కళాశాలలో మూడో సెమిస్టర్ చదువుతున్న దక్కలి చంద్రకళ (30) అనే విద్యార్థిని తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రంగా రెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన దక్కలి చంద్రకళ శాతవాహన యూనివర్సిటీ లా కాలేజీలో ప్రవేశం పొంది మూడో సెమిస్టర్ విద్యనభ్యసిస్తోంది. ఆదివారం రోజున హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. తోటి విద్యార్థినులు వచ్చి చూసేసరికి ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో వెంటనే వర్సిటీ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న కరీంనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చంద్రకళ ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని…. ఎలాంటి ఆత్మహత్య లేఖ లభించలేదని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించారు.
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్‌లోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

