...
...
Next Story

తెలంగాణలో హోటళ్లకు ఎల్పీజీ సిలిండర్ కష్టాలు.. కొన్ని రోజులు తాళాలు వేయడం తప్పదా?

LPG Cylinder : కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లపై తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చక్కబెట్టాలని కోరింది. లేకుంటే హోటళ్లు తాత్కాలికంగా మూసేయాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపింది.

Published on: Mar 10, 2026, 20:51:39 IST
Advertisement

పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ లేఖ రాసింది. ఎల్పీజీ గ్యాస్ ధరలపై ఉన్న నిబంధనలను హోటళ్ల వరకు తగ్గించాలని కోరింది. హోటళ్లను అత్యవసర సేవల కింద పరిగణించాలని పేర్కొంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాకు హోటళ్లు, రెస్టారెంట్లకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి మంత్రి ఉత్తమ్ జోక్యం చేసుకోవాలని అసోసియేషన్ కోరింది. తెలంగాణ టూరిజం, హాస్పటాలిటీ, సేవల్లో హోటళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని గుర్తు చేసింది.

తెలంగాణలో ఎల్పీజీ సిలిండర్ సమస్యలు
తెలంగాణలో ఎల్పీజీ సిలిండర్ సమస్యలు

కమర్షియల్ ఎల్పీజీతో తెలంగాణలోని హోటళ్ల యజమానులు తమ కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరా ఆలస్యం అయితే, ఒకటి లేదా రెండు రోజుల్లో రాష్ట్రంలో 60 శాతం కంటే ఎక్కువ హోటళ్ల కార్యకలాపాలను మూసివేయాల్సి వస్తుందని చెబుతున్నారు.

'ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా అందుబాటులోకి రాకపోతే ఒకటి లేదా రెండు రోజుల్లో 60 శాతానికి పైగా హోటళ్లు మూసివేయాల్సి వస్తుంది.' అని తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి అన్నారు. తగినంత స్టాక్‌లు ఉన్న పెద్ద హోటళ్లు ఒక వారానికి సరిపడా నిర్వహించగలవు. కానీ చిన్నవి రెండు రోజుల్లోనే మూసివేయవలసి రావచ్చని చెప్పారు.

తెలంగాణ అంతటా 40,000-50,000 రెస్టారెంట్లు ఉన్నాయని, వాటిలో హైదరాబాద్‌లోని 20,000 హోటళ్లు ఉన్నాయని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. హోటళ్ల క్లోజ్ అయితే.. కేవలం టూరిస్టులు, ట్రావెలర్స్ మీద మాత్రమే కాకుండా వర్కర్స్, ఉద్యోగులు, విద్యార్థుల మీద కూడా ప్రభావం పడుతుందన్నారు.

మరోవైపు తెలంగాణలో గృహ, వాణిజ్య రంగాలకు ఎల్‌పీజీ వంట గ్యాస్ సరఫరా సాధారణంగానే ఉందని పౌర సరఫరాల శాఖ సీనియర్ అధికారి తెలిపారు. ఎల్‌పీజీ సిలిండర్లను నిల్వ చేయడం లేదా బ్లాక్ మార్కెటింగ్ చేయడం వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పశ్చిమాసియాలో సంఘర్షణల మధ్య గృహ, వాణిజ్య రంగాలకు ఎల్పీజీ వంట గ్యాస్ సరఫరాలో ఏదైనా అంతరాయం ఏర్పడిందా? అని అడిగినప్పుడు 'పరిస్థితులు సజావుగా జరుగుతున్నాయి. ప్రజలు భయపడకూడదు. ప్రస్తుతం పరిస్థితి సౌకర్యంగా ఉంది.' అని స్టీఫెన్ రవీంద్ర అన్నారు.

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు భారతదేశానికి ఎల్పీజీ సరఫరాపై ప్రభావం పడింది. ప్రభుత్వం గృహ వంట గ్యాస్ సరఫరాకు ప్రాధాన్యత ఇచ్చింది. దీని ఫలితంగా వాణిజ్య ఎల్పీజీని ఉపయోగించే హోటళ్ళు, రెస్టారెంట్లకు సరఫరా సంక్షోభం ఏర్పడింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe