Hyderabad : మహిళల అండాలు సేకరిస్తున్న మాఫియా గుట్టురట్టు - ఎనిమిది మంది అరెస్ట్! వెలుగులోకి కీలక విషయాలు
హైదరాబాద్, మల్కాజ్‌గిరి కమిషనరేట్ల పరిధిలో సైబరాబాద్, రాచకొండ పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో అక్రమ అండాల (ఊసైట్) విక్రయాల రాకెట్ గుట్టురట్టయింది. 43 మంది బాధితులను కాపాడగా, 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ నగరం అడ్డాగా సాగుతున్న మరో దారుణమైన అక్రమ దందా బట్టబయలైంది. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని అమాయక మహిళల నుంచి అక్రమంగా అండాలను (ఊసైట్) సేకరించి విక్రయిస్తున్న ఒక భారీ రాకెట్‌ను మల్కాజ్‌గిరి పోలీసులు ఛేదించారు. మల్కాజ్‌గిరి, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు ఒకేసారి నిర్వహించిన మెరుపు దాడుల్లో ఈ అక్రమ దందా గుట్టురట్టయింది.

8 మంది అరెస్ట్…..
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ దాడుల్లో అక్రమ అండాల విక్రయాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో, ఈ దందాలో చిక్కుకున్న 43 మంది బాధితులైన మహిళలను రక్షించారు.
ఈ ముఠా ప్రధానంగా ఇతర రాష్ట్రాలకు చెందిన పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల మహిళలను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వారికి పెద్ద మొత్తంలో డబ్బులు ఎరగా వేసి అండ దానం (ఎగ్ డొనేషన్) ప్రక్రియల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌కు రప్పించేవారు. ఇక్కడ పలు దవాఖానలు, కేంద్రాల ద్వారా ఎటువంటి చట్టబద్ధమైన నియమ నిబంధనలు పాటించకుండా, ఆరోగ్య ముప్పులను సైతం పక్కనపెట్టి వారి నుంచి అక్రమంగా అండాలను సేకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
మల్కాజ్‌గిరి సీపీ సుమతి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ సమగ్ర ఆపరేషన్ జరిగింది. బేగంపేట్, సరోర్‌నగర్ పోలీసులతో పాటు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ) బలగాలు సంయుక్తంగా ఈ దాడుల్లో పాల్గొన్నాయి. పక్కా సమాచారంతో నాలుగు స్థావరాలపై ఒక్కసారిగా నిందితులను రౌండప్ చేశారు. ఈ అక్రమ దందా వెనుక ఇంకా ఏయే ఆసుపత్రులు, మధ్యవర్తులు లేదా ఏజెంట్లు ఉన్నారనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
ఈ కేసుపై మల్కాజ్ గిరి సీపీ సుమతి మాట్లాడుతూ…. అక్రమంగా అండాల సేకరణ, విక్రయాల దందాను గుట్టురట్టు చేశామన్నారు. ఈ దందాలో ఇందౌర్ వాసి అమిత్‌శర్మ ప్రధాన నిందితుడిగా గుర్తించామని పేర్కొన్నారు. ఎక్కువగా బెంగాల్‌లో పేద మహిళలను గుర్తించి రిక్రూట్ చేసుకున్నారన్నారు. ప్రకాశ్‌నగర్, బేగంపేట, ఎర్రగడ్డ, సరూర్‌నగర్, గోపాలపురం ప్రాంతాల్లో సోదాలు చేశామని… వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు మహిళలను గుర్తించి కాపాడామన్నారు.
నిందితులు మధ్యవర్తుల ద్వారా ఐవీఎఫ్ సెంటర్లను సంప్రదించారని… అండాల సేకరణ ప్రక్రియకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఇస్తామని మహిళలకు ఆశ చూపారని సీపీ తెలిపారు. మహిళలకు హార్మోన్ ఇంజెక్షన్లు, మెడిసిన్ ఇచ్చినట్లు విచారణలో తేలిందని వివరించారు.మహిళల ఆధార్ కార్డులు, అఫిడవిట్లు సహా పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నామని….అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నామని చెప్పారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

