మెదక్ జిల్లాలో 33 ఏళ్ల గిరిజన మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈనెల 11వ తేదీన ఈ దారుణం వెలుగులోకి రాగా… తాజాగా ఈ కేసులోని నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక టీమ్స్ తో దర్యాప్తు జరపగా…. కీలక విషయాలు బయటికి వచ్చాయి. ఇందుకు సంబంధించిన వివరాలను మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు వెల్లడించారు.
మాటలతో నమ్మించి…

జిల్లా ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం…. నిజామాబాద్ జిల్లాలోని సేవాలాల్‌తండాకు చెందిన మెగావత్ ఫకీరానాయక్ సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఓ తండాలో నివాసం ఉంటున్నాడు. అత్తగారింట్లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న అతడు…. ఈ నెల 10న మెదక్ కోర్టుకు హాజరయ్యాడు. అక్కడ్నుంచి తిరిగి వచ్చే సమయంలో మెదక్ మండల పరిధికి చెందిన 33 ఏళ్ల గిరిజన మహిళ కనిపించింది. ఆమెను పరిచయం చేసుకుని మాటల్లో పెట్టాడు. తన మాటలతో నమ్మించి… పని ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఆ తర్వాత…. బస్సులో ఏడుపాయల ఆలయ సమీపంలోకి తీసుకెళ్లాడు.
ఆలయానికి సమీపంలో ఉన్న ఓ వెంచర్ లోకి ఆమెను తీసుకెళ్లి… బలవంతపెట్టాడు. చీరతో కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత… కర్రతో తలపై బలంగా కొట్టటంతో ఆమె ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమె ముక్కుపుడక తీసుకొని నిందితుడు ఫకీర్ నాయక్ పారిపోయాడు.
సదరు మహిళను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు… వెంటనే మెదక్ కు తరలించి చికిత్స అందించారు. అప్పటికి పరిస్థితి విషమించటంతో హైదరాబాద్ లోని గాంధీకి తరలించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఈనెల 11వ తేదీన మృతి చెందారు.
ఈ కేసుపై త్వరితగతిన విచారణ చేపట్టిన పోలీసులు… సీసీ కెమెరాల ఆధారంగా సమాచారం సేకరించారు. ఫకీరా నాయక్ ఆమెను తీసుకెళ్లినట్లు గుర్తించారు. అసలు నిందితుడు అతడే అని గుర్తించి… మంగళవారం మెదక్ లో అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించబడిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
13వ తేదీనే జీవితఖైదు విధించిన కోర్టు
{{/usCountry}}ఈ కేసుపై త్వరితగతిన విచారణ చేపట్టిన పోలీసులు… సీసీ కెమెరాల ఆధారంగా సమాచారం సేకరించారు. ఫకీరా నాయక్ ఆమెను తీసుకెళ్లినట్లు గుర్తించారు. అసలు నిందితుడు అతడే అని గుర్తించి… మంగళవారం మెదక్ లో అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించబడిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
13వ తేదీనే జీవితఖైదు విధించిన కోర్టు
{{/usCountry}}36 ఏళ్ల ఫకీరానాయక్‌పై ఇది వరకే దొంగతనం, హత్యలకు సంబంధించి పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 2020 నవంబరులో మెదక్‌లో ఓ మహిళపై హత్యాచారానికి పాల్పడిన కేసులో అతడిపై నేరం రుజువైంది. సోమవారమే(అక్టోబర్ 13,2025) జిల్లా న్యాయమూర్తి జీవితఖైదు విధించారు. ఆ మరుసటి రోజే అతడిని మెదక్ గిరిజన మహిళపై హత్యాచార కేసులో అరెస్టు చేసి రిమాండుకు పంపారు.