మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. ఛత్తీస్‌గఢ్‌ సీఎం ఎదుట 70 మందితో లొంగిపోనున్న ఆశన్న!

మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ఛత్తీస్‌గఢ్‌ సీఎం ఎదుట గురువారం ఆయుధాలను సరెండర్ చేయనున్నారు.

Published on: Oct 15, 2025, 21:58:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మావోయిస్టు పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆపరేషన్ కగార్‌తో చాలా మందిని కోల్పోయిన పార్టీ.. వరుస లోంగుబాట్లతోనూ ఎదురుదెబ్బలు తింటుంది. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు.. 60 మంది సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట బుధవారం లొంగిపోయారు. అయితే తాజాగా మరో మావోయిస్టు అగ్రనేత కూడా లొంగిపోయేందుకు రెడీ అయ్యారు.

ఆశన్న లొంగుబాటు
ఆశన్న లొంగుబాటు

కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న.. గురువారం చత్తీస్‌ఘడ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట లొంగిపోనున్నట్టుగా తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని మూడు జిల్లాల్లో బుధవారం 43 మంది మహిళా మవోయిస్టులు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన కనీసం ఇద్దరు సభ్యులు సహా 78 మంది లొంగిపోయేందుకు వచ్చినట్టుగా సమాచారం. ఇది మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బగా చెప్పవచ్చు.

ఆశన్నది ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామం. 40 ఏళ్ల కిందట ఉద్యమం వైపునకు ఆకర్శితులు అయ్యారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ స్కూల్‌లో చదువుకున్నారు. తర్వాత కాజీపేటలో సెకండరీ విద్య, కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. ఈ సమయంలోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆర్ఎస్‌యూ కోసం ఆశన్న చాలా కాలం పని చేశారు. తర్వాత నిర్బంధం పెరగడంతో 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మావోయిస్టు పార్టీలో ఆయన కీలక బాధ్యతలు చూసుకున్నారు.

నిజానికి మావోయిస్ట్ టాప్ కమాండర్ బసవరాజు మరణం తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీ పదవి రేసులో ఆశన్న కూడా ఉన్నారని వార్తలు వచ్చాయి. కానీ పార్టీ ఆ పదవిని ఆయనకు ఇవ్వలేదు. ఆశన్న అనేక విషయాల్లో సమర్థుడని పేరు ఉంది. కానీ జనరల్ సెక్రటరీ పదవి రాకపోడవంతో ఆయనతోపాటుగా కొంతమంది క్యాడర్‌లోనూ అసంతృప్తి నెలకొంది.

ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులపై కేంద్రం విరుచుకుపడుంది. చాలా మంది అగ్రనేతలు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. కీలక నేతలు కూడా చనిపోవడంతో మావోయిస్టు పార్టీలో గందరగోళం నెలకొంది. తర్వాత వరుసగా లొంగుబాట్లు అవుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులు లేని భారత్‌ను చూస్తారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చాలా సార్లు చెప్పుకొచ్చారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More