మరో 6 నెలలు కాల్పుల విరమణ.. కేంద్రంపై పోరాటానికి మావోయిస్టు పార్టీ పిలుపు!
తెలంగాణలో కాల్పుల విరమణను మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. అయితే రాష్ట్రంలో నెలకొన్న శాంతిని దెబ్బతీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు.
కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. మరో ఆరు నెలలు కాల్పుల విరమణ పొడిగించనున్నట్టుగా ప్రకటించింది. తెలంగాణలోని అన్ని పార్టీలు, ప్రజా సంస్థలు, సామాజిక ఉద్యమాలు శాంతియుత వాతావరణం కొనసాగింపు కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలను ప్రారంభించాయని పార్టీ అధికారిక ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టిందన్నారు.

గత మే నెలలో 6 నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటించామని, అదే విధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో 6 నెలలు కాల్పుల విరమణ పొడిగిస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో లేఖ విడుదల చేశారు. 'మే నెలలో ఆరు నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటించాం. ఈ ఆరు నెలలు కూడా మా వైపు నుండి అదే వ్యూహాన్ని అమలు చేస్తాం. శాంతియుత వాతావరణం కొనసాగేలా చర్యలు కూడా తీసుకున్నాం.' అని లేఖలో జగన్ అన్నారు.
ప్రభుత్వం ఇలాగే కొనసాగాలని తాము కోరుకుంటున్నామని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో నెలకొన్న ప్రశాంత వాతావరణాన్ని కేంద్రం చెడగొట్టడానికి ప్రయత్నిస్తోందని జగన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడటానికి అన్ని పార్టీలు, అన్ని సామాజిక సమూహాలు, సంఘాలు, విద్యార్థులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు చేతులు కలపాలని పిలుపునిచ్చారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించిందని లేఖలో చెప్పారు. ఈ 6 నెలల కాలంలో అనుకున్న పద్ధతులను తమ వైపు నుంచి అమలు చేసి శాంతియుత వాతావరణం ఉండేలా వ్యవహరించామన్నారు. ఇదే శాంతియుత వాతావరణ కొనసాగాలని తెలంగాణ సమాజం కోరుకుంటోందన్నారు. గతంలో కొనసాగిన విధంగానే తమ వైపు నుంచి శాంతియుత వాతావరణాన్ని కొసాగించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా గతంలో వ్యవహరించిన విధంగానే ఉండాలని కోరుకుంటున్నామన్నారు.
'కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో కొనసాగుతున్న శాంతియుత వాతావరణాన్ని భంగం చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందరూ ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడాలి.' అని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖలో పేర్కొన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


