రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఐడీ కొత్త డీజీగా పరిమళన్ నూతన్ నియమితులు కాగా… పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా చేతన్, మహేశ్వరం డీసీపీగా నారాయణరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పలు జిల్లాలకు కొత్త ఎస్పీలు కూడా వచ్చారు.
పలు జిల్లాలకు కొత్త ఎస్పీలు….

ఈ బదిలీల్లో భాగంగా ములుగు జిల్లా ఎస్పీగా కేకన్ సుధీర్ రామ్‌నాథ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీగా సంకీర్త్,నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీగా సంగ్రామ్ పాటిల్,మహబూబాబాద్ ఎస్పీగా శబరీష్,వనపర్తి ఎస్పీగా సునీత,వికారాబాద్ జిల్లా ఎస్పీగా స్నేహ మిశ్ర నియమితులయ్యారు.
గవర్నర్ ఏడీసీగా పాటిల్ కాంతిలాల్ సుభాష్, పెద్దపల్లి డీసీపీగా రామ్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్ ఎస్పీగా అవినాష్ కుమార్, భువనగిరి అడిషనల్ ఎస్పీగా కంకణాల రాహుల్ రెడ్డి, జగిత్యాల అడిషన్ ఎస్పీగా శేషాద్రిని రెడ్డి, ములుగు అడిషనల్ ఎస్పీగా శివం ఉపాధ్యాయ, ఆదిలాబాద్ అదనపు ఎస్పీగా మౌనిక భాద్యతలు చూడనున్నాయి.
ఇక ఏటూరు నాగారం ఏఎస్పీగా మనన్ భట్, నిర్మల్ ఏఎస్పీగా సాయికిరణ్, వేములవాడు ఏఎస్పీగా రుత్విక్ సాయి, సత్తుపల్లి ఏసీపీగా యాదవ్ వసుంధర, టీజీ ట్రాన్స్‌కో ఎస్పీగా శ్రీనివాస్ నియమితలుయ్యారు.
హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్, సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ కారే, మల్కాజ్ గిరి డీసీపీగా శ్రీధర్ ను నియమించారు.