Hyderabad Crime News : మేడ్చల్ జిల్లాలో దారుణం - బాలికపై తొమ్మిది మంది సామూహిక అత్యాచారం..!
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై తొమ్మిది మంది దారుణానికి ఒడిగట్టారు. స్నేహితుడి సహాయంతో మూడు రోజుల పాటు నిర్బంధించి అఘాయిత్యానికి పాల్పడ్డారు.
తెలంగాణలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో అత్యంత దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికపై తొమ్మిది మంది వ్యక్తులు కలిసి సమూహ అత్యాచారానికి ఒడిగట్టారు.

3 రోజుల పాటు నిర్బంధం..!
పోలీసులు అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. బాధితురాలికి తెలిసిన ఓ స్నేహితుడి సాయంతో నిందితులు ఈ కుట్రకు తెరలేపారు. ఆ స్నేహితుడి ద్వారానే బాలికను ఒక చోటు నుంచి మరోక చోటు తీసుకెళ్లిన నిందితులు…. దాదాపు మూడు రోజుల పాటు నిర్బంధంలో ఉంచారు. ఆ మూడు రోజులు ఆమెపై తీవ్ర స్థాయిలో లైంగిక దాడులకు, అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బాధితురాలు ఈ దారుణం నుంచి బయటపడి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అల్వాల్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు…. ఈ నేరంతో సంబంధం ఉన్న తొమ్మిది మంది నిందితులలో ఎనిమిది మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
ఈ కేసులో ప్రమేయం ఉన్న మరొక నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు తీవ్రతరం చేశామని అధికారులు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు…. కేసును అన్ని కోణాల్లో లోతుగా విచారిస్తున్నామని పోలీస్ యంత్రాంగం పేర్కొంది. పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది. మరోవైపు పూర్తిస్థాయి విచారణ తర్వాతే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

