Hyderabad Crime News : బొల్లారంలో దారుణం - చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య! వాటర్ ట్యాంక్‌లో డెడ్ బాడీ
హైదరాబాద్‌లోని బొల్లారంలో కనిపించకుండా పోయిన ఓ చిన్నారి విల్లా వాటర్ ట్యాంక్‌లో మృతదేహమై తేలింది. కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న ఈ ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బొల్లారం పోలీస్ స్టేషన్ సరిహద్దుల్లో దారుణం వెలుగుచూసింది. శనివారం నుంచి కనిపించకుండా పోయిన ఓ మైనర్ బాలిక…. ఆదివారం తెల్లారేసరికి విల్లాలోని వాటర్ ట్యాంక్‌లో శవమై తేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వాటర్ ట్యాంకులో డెడ్ బాడీ….
బొల్లారం పోలీసుల కథనం ప్రకారం.. కౌకూర్ ప్రాంతంలోని 'విల్లా ఆర్చిడ్స్' అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో శనివారం ఒక చిన్నారి అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా బాలిక జాడ దొరకలేదు. ఆదివారం ఉదయం విల్లాలోని నీటి ట్యాంక్‌ను పరిశీలించగా అందులో బాలిక మృతదేహం కనిపించింది.
ట్యాంక్‌లో చిన్నారి కాళ్లు, చేతులు తీగలు లేదా తాళ్లతో ముడివేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇది కేవలం ప్రమాదవశాత్తు జరిగింది కాదని… పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన హత్యేనని ప్రాథమికంగా భావిస్తున్నారు.
బాలిక మృతి వెనుక అదే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న వాచ్‌మన్ ప్రమేయం ఉందంటూ చిన్నారి కుటుంబ సభ్యులు తీవ్రంగా అనుమానిస్తున్నారు. తమ పాపను అతడే కిడ్నాప్ చేసి, హత్య చేసి ట్యాంక్‌లో పడేసి ఉంటాడని వారు బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న వెంటనే బొల్లారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి శాంపిల్స్ సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
"మేము అన్ని కోణాల్లోనూ కేసును సమగ్రంగా విచారిస్తున్నాం. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తాం," అని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఒక పసిపాప కాళ్లు, చేతులు కట్టేసి నీటి ట్యాంక్‌లో పడేసిన తీరు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

