Sign in

Telangana : ఇంటర్ పరీక్షా కేంద్రంలో షాకింగ్ ఘటన - మైనర్ బాలిక ప్రసవం..! వెలుగులోకి అసలు విషయం

ఇంటర్ పరీక్షా కేంద్రంలోని టాయ్‌లెట్‌లో మైనర్ బాలిక ప్రసవించింది. అప్పుడే పుట్టిన ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో వెలుగు చూసిన ఈ ఘటన… కలకలం రేపింది. మైనర్ బాలిక ప్రసవ ఘటనపై విచారణ జరుగుతోంది.

Published on: Feb 28, 2026, 13:24:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇంటర్ పరీక్షా కేంద్రంలోని బాత్ రూమ్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాస్తున్న ఓ విద్యార్థిని(మైనర్)….. మృత శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటుచేసుకుంది.

బాత్రూంలో ప్రసవించిన ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని..! (image source pixel)
బాత్రూంలో ప్రసవించిన ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని..! (image source pixel)

పాల్వంచలోని ఓ కేంద్రానికి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల బాలిక ఇంగ్లీష్(ఫిబ్రవరి 27) పరీక్ష రాయటానికి వచ్చింది. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఇన్విజిలేటర్ అనుమతితో టాయ్‌లెట్‌కు వెళ్లింది. ఎంతసేపటికీ రాకపోవటంతో టాయిలెట్ వైపు వెళ్లి చూశారు.

సదరు విద్యార్థిని నెమ్మదిగా నడుచుకుంటూ బయటికి వచ్చింది. ఆమె తీరును గమనించిన సిబ్బంది… ఆమెను ప్రశ్నించారు. బాలిక పలు వివరాలు చెప్పటంతో…. అసలు విషయం బయటపడింది. టాయిలెట్ లోకి వెళ్లిచూడగా.. బేసిన్‌లో చనిపోయిన శిశువు పడి ఉండటాన్ని సిబ్బంది గమనించారు.

పరువు పోతుందనే భయంతోనే ఎవరికీ అనుమానం రాకుండా శిశువును బాత్రూం బేసిన్‌లో కుక్కినట్లు బాలిక తెలిపినట్లు సిబ్బంది తెలిపారు. దీంతో పరీక్షా కేంద్రం నిర్వాహకులు విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులకు ద్వారా తెలియజేశారు.

పరీక్షా కేంద్రానికి వచ్చిన అధికారులు… బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. వాష్ రూంలోని మృత శిశువును 108 వాహనంలో గవర్నమెంట్ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందగా… పోలీసులు విచారణ జరుపుతున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More