తెలంగాణలో కొత్త వైన్ షాపులకు టెండర్ల ప్రక్రియ నడుస్తోంది. అయితే మునుగోడులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ రూల్స్‌తో సంబంధం లేకుండా తాను చెప్పేవి ఫాలో కావాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని వైన్ షాపులకు టెండర్లు వేసేవారు తాను పెట్టిన షరతులు పాటించాలంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని మునుగోడు, గట్టుప్పల్, చండూరు, నాంపల్లి, మర్రిగూడ, నాంపల్లి, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో టెండర్లు వేసేవారు తాను పెట్టిన షరతులు పాటించాలని చెబుతున్నారు.

కొత్త వైన్ షాపులు దక్కించుకునేవారు సిట్టింగ్‌లు పెట్టకూడదని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. అంతేకాదు ఊరి బయట వైన్ షాపు ఉండాలన్నారు. బెల్టు షాపులకు మద్యం విక్రయించకూడదని అంటున్నారు. వైన్ షాపు యజమానులు సిండికేట్‌గా మారవద్దని హెచ్చరించారు. సాయంత్రం 4:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయించాలన్నారు. ఈ మేరకు మునుగోడుకు కొత్త రూల్స్ సెట్ చేస్తూ బహిరంగ ప్రకటన చేశారు.
రాష్ట్రం మెుత్తం అమలు అయ్యే నిర్ణయాలు తమ వద్ద అమలు కాకూడదని చెప్పకనే చెప్పారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. టెండర్లను మండలానికి చెందిన స్థానికులు మాత్రమే వేయాలని, ఇతర మండలానికి చెందిన వ్యక్తులు వేయకూడదని స్పష్టం చేశారు. వైన్ షాపుకు అనుబంధంగా పర్మిట్ రూమ్ ఉండొద్దన్నారు.
ఈ రూల్స్ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, బెల్టు షాపుల నిర్మూలన, మహిళల సాధికారతే తమ ఉద్దేశమని పేర్కొన్నారు కోమటిరెడ్డి. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదని, నియోజకవర్గ ప్రజలు, యువత మద్యం మత్తును వదిలి ఆర్థికంగా ఎదగాలన్నది తన కోరిక అని చెప్పారు. షరతులు పాటించని వారు టెండర్స్ వేయవద్దని, తదుపరి నష్టపోకూడదని సూచించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి.
ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన కొత్త రూల్స్ వైరల్ అవుతున్నాయి. రాష్ట్రం మెుత్తం అమలు చేసే నిర్ణయాలు తమ నియోజకవర్గంలో చెల్లవని క్లారిటీ ఇచ్చారు. దీంతో మద్యం దుకాణాలకు టెండర్లు వేసే వారిలో ఆందోళన మెుదలైంది. తనను కాదని మునుగోడులో మద్యం దుకాణాలు నడపలేరని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు కోమటిరెడ్డి.
{{/usCountry}}ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన కొత్త రూల్స్ వైరల్ అవుతున్నాయి. రాష్ట్రం మెుత్తం అమలు చేసే నిర్ణయాలు తమ నియోజకవర్గంలో చెల్లవని క్లారిటీ ఇచ్చారు. దీంతో మద్యం దుకాణాలకు టెండర్లు వేసే వారిలో ఆందోళన మెుదలైంది. తనను కాదని మునుగోడులో మద్యం దుకాణాలు నడపలేరని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు కోమటిరెడ్డి.
{{/usCountry}}