Siddipet Serial Murder Cases : సిద్దిపేట జిల్లాలో సంచలనం సృష్టించిన వరుస హత్యలు, దోపిడీల కేసులను పోలీసులు ఛేదించారు. పక్కా ప్రణాళికతో ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ…. బంగారం, నగదు కోసం దారుణాలకు ఒడిగడుతున్న తల్లి, ఆమె మైనర్ కుమారుడిని అరెస్ట్ చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూంపల్లి గ్రామానికి చెందిన దూబ్బయ్య, భార్య చకాలి రజిత (38)ను అరెస్టు చేసి జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించగా…. ఆమె మైనర్ కొడుకును జువైనల్ హోమ్‌కు పంపించినట్లు సీపీ తెలిపారు.
గుర్తుతెలియని మృతదేహంతో విచారణ మొదలు..
ఈ నెల ఆగస్టు 8న రామక్కపేట శివార్లలోని వ్యవసాయ పొలాల్లో సగం కాలిన స్థితిలో ఒక అనాథ మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసును సవాలుగా తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులకు, మృతురాలు భూంపల్లి గ్రామానికి చెందిన అతికం విజయ (45)గా గుర్తింపు లభించింది. బాధితురాలి గురించిన సమాచారం సేకరించిన అనంతరం…. కేసు మూలాలు రజిత కుటుంబం వైపు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
బాధితురాలు విజయను రజిత, ఆమె కొడుకు కలిసి తమ కిరాణా షాప్‌లోకి పిలిపించి, అక్కడ ఊపిరి ఆడకుండా చేసి దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఆ తర్వాత శవాన్ని ఒక మోపెడ్‌పై ఎక్కించుకుని ఊరి వెలుపలకు తీసుకెళ్లి, పెట్రోల్ పోసి నిప్పంటించి ఆధారాలు దహనం చేసేందుకు యత్నించారు.
"విచారణలో మృతురాలి గుర్తింపును నిర్ధారించుకున్న తర్వాత, నిందితుల ఆచూకీ కనిపెట్టాం. ఈ తల్లి-కొడుకుల జంట ఒంటరిగా ఉండే మహిళల కదలికలు, వారి వద్ద ఉన్న ఆస్తులు, కుటుంబ తగాదాలను నిశితంగా పరిశీలించి టార్గెట్‌గా చేసుకునేవారు" అని సీపీ రష్మీ పెరుమాళ్ వివరించారు.
మరో హత్య, దోపిడీ కేసుల్లోనూ హస్తం….
విచారణను మరింత లోతుగా చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాదే మే 28న అచ్చమ్మయ్యపల్లి అటవీ ప్రాంతంలో కాలిన గాయాలతో శవమై కనిపించిన కుంట రేఖ హత్య కేసులో కూడా ఈ నిందితుల ప్రమేయమే ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా…. జూన్ 2025లో అన్నపూర్ణ అనే మహిళ నుంచి ఐదు తులాల బంగారు మంగళసూత్రాన్ని దోచుకెళ్లిన ఘటనలోనూ ఈ తల్లి, కొడుకులే నిందితులని విచారణకర్తలు అనుమానిస్తున్నారు.
{{/usCountry}}విచారణను మరింత లోతుగా చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాదే మే 28న అచ్చమ్మయ్యపల్లి అటవీ ప్రాంతంలో కాలిన గాయాలతో శవమై కనిపించిన కుంట రేఖ హత్య కేసులో కూడా ఈ నిందితుల ప్రమేయమే ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా…. జూన్ 2025లో అన్నపూర్ణ అనే మహిళ నుంచి ఐదు తులాల బంగారు మంగళసూత్రాన్ని దోచుకెళ్లిన ఘటనలోనూ ఈ తల్లి, కొడుకులే నిందితులని విచారణకర్తలు అనుమానిస్తున్నారు.
{{/usCountry}}కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల వద్ద నుంచి సుమారు రూ. 10 లక్షల విలువైన ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 5.61 తులాల బంగారం, 53 తులాల వెండి, రూ. 1.03 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు మరియు నేరానికి ఉపయోగించిన మోపెడ్‌ను జప్తు చేశారు.
వెబ్ సిరీస్‌లు చూసి నేరాల స్కెచ్…
పోలీసుల విచారణలో నిందితులు సంచలన విషయాలు బయటపెట్టారు. క్రైమ్ ఆధారిత వెబ్ సిరీస్‌లను విపరీతంగా చూస్తూ నేరాలు ఎలా చేయాలో ప్లాన్ చేసుకునేవామని ఒప్పుకున్నారు. బాధితుల ఆస్తులు, వారి వ్యక్తిగత వివాదాలు, కదలికలను అధ్యయనం చేసిన తర్వాతే దాడులకు పాల్పడేవారని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ ఘటనల నేపథ్యంలో స్థానిక ప్రజల భద్రతపై పోలీస్ కమిషనర్ ప్రత్యేక సూచనలు చేశారు. నేరాల నియంత్రణకు, భద్రతా చర్యలను పటిష్టం చేసేందుకు ప్రతీ ఒక్కరూ తమ ఇళ్లు, వ్యాపార సముదాయాల వద్ద సీసీటీవీ (CCTV) కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీపీ రష్మీ పెరుమాళ్ కోరారు.