Hyderabad : ఉలిక్కిపడ్డ జనం - పలు ప్రాంతాల్లో భారీ శబ్దాలు.. రోడ్లపైకి పరుగులు!
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వింత శబ్దాలు వినిపించాయి. భూమి కంపించినట్లు అనిపించడంతో జనం ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలియక పిల్లలతో సహా వీధుల్లోకి పరుగులు తీశారు.
భాగ్యనగరంలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లను తలపించేలా వింత శబ్దాలు రావడంతో పాటు భూమి కంపించినట్లు అనిపించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉదయాన్నే ఏం జరుగుతుందో అర్థం కాక, భయాందోళనలకు గురైన ప్రజలు తమ పసిపిల్లలను ఎత్తుకుని ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు.

ఉదయం సమయంలో శబ్ధాలు..!
ఇవాళ ఉదయం 9:15 గంటల ప్రాంతంలో ఈ ఊహించని సంఘటన జరిగింది. ముఖ్యంగా రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లి, అత్తాపూర్, ఎర్రబోడ, లంగర్‌హౌస్, కేశవస్వామినగర్ తదితర పరిసర ప్రాంతాల్లో వరుసగా భారీ వింత శబ్దాలు వినిపించాయి. సాధారణ శబ్దాలకు భిన్నంగా, ఒక్కసారిగా పెద్ద ఎత్తున శబ్దం రావడంతో భవనాల్లోని కిటికీలు, తలుపులు కంపించినట్లయిందని స్థానికులు చెబుతున్నారు.
అది భూకంపమా లేక వేరే ఏదైనా ప్రమాదం జరిగిందా అనే గందరగోళంలో జనం రోడ్లపైకి వచ్చి చేరారు. కొన్ని క్షణాల పాటు ఏమి జరుగుతుందో తెలియక ఆయా ప్రాంతాల్లో తీవ్ర తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు…. శబ్దాలకు గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు. భూగర్భంలో జరిగిన మార్పులా లేక భూమిలో నెలకొన్న ప్రకంపనలా..? అనే కోణంలో విపత్తు నిర్వహణ బృందాలు మరియు నిపుణులు పరిశీలిస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

