Warangal : పేర్ల నమోదుకు రూ. 70 వేలు లంచం డిమాండ్ - ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన మహిళా అధికారిణి

తెలంగాణ ఏసీబీకి మరో అవినీతి అధికారిణి పట్టుబడింది. మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలోకి పేర్లు నమోదు చేసేందుకు రూ. 70 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Published on: Oct 17, 2025, 20:03:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గత కొంతకాలంగా అవినీతి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇటీవలే కాలంలో చాలా మంది అధికారులు పట్టుబడిన ఘటనలు వెలుగు చూశాయి. ఇందులోనూ మహిళా అధికారిణుల సంఖ్య కూడా ఎక్కవగా ఉంటోంది. తాజాగా వరంగల్ జిల్లాలో మత్స్యకార అధికారిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అల్లు నాగమణి ఏసీబీకి దొరికిపోయారు. ఆమెతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని కూడా అరెస్ట్ చేశారు.

ఏసీబీకి చిక్కిన అల్లు నాగమణి
ఏసీబీకి చిక్కిన అల్లు నాగమణి

రూ. 70 వేలు లంచం డిమాండ్…

మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలోకి 84 మంది నూతన సభ్యులను చేర్చుకోవడానికి సంబంధిత సభ్యులు మత్స్యకార అధికారిణి అయిన నాగమణికి దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే ఈ అప్లికేషన్ ను ప్రాసెస్ చేయడంతో పాటు పేర్లు నమోదు ఉత్తర్వులు జారీ చేయడానికి రూ. 70 వేలు లంచం డిమాండ్ చేసింది.

ఇదే విషయంపై ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే రూ. 70 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్నారు. వారి కార్యాలయంలో క్షేత్ర స్థాయి అధికారిగా (పొరుగు సేవలు) పని చేస్తున్న పెద్దబోయిన హరీష్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏ ప్రభుత్వాధికారి అయినా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. అవినీతి నిరోధక శాఖ "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని తెలిపారు. అంతేకాకుండా వివిధ సామాజిక మాధ్యమాలైన "వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) లేదా వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More