నాగార్జున సాగర్ టు శ్రీశైలం : కృష్ణమ్మ అలలపై లాంచీ యాత్ర, రూ. 2 వేలకే ట్రిప్, ప్యాకేజీ వివరాలివే

టూరిస్టులకు తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది.నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ టూర్ పై ప్రకటన చేసింది. నవంబర్ 22 నుంచి ఈ టూర్ ప్యాకేజీని ప్రారంభిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Published on: Nov 21, 2025, 13:51:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓవైపు కృష్ణమ్మ పరవళ్లు… మరోవైపు చుట్టూ కొండలు… మరికొంత దూరం వెళ్తే నలమల్ల ఫారెస్ట్ అందాలు… ఇలా ఒకటి కాదు ఎన్నో ప్రకృతి అందాలను చూసి ఆస్వాదించవచ్చు. ఏకంగా నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణంలో చేయవచ్చు. ఇందుకోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. జర్నీ తేదీలను కూడా ప్రకటించింది.

సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ యాత్ర
సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ యాత్ర

సాగర్ టు శ్రీశైలం లాంచీ యాత్ర….

నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ యాత్ర ఉంటుంది. ఈ ప్యాకేజీని నవంబర్ 22వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ప్రతి శనివారం ఈ యాత్ర ఉండేలా ప్లాన్ చేశారు.ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించేలా లాంచీని సిద్ధం చేశారు.

ఈ లాంచీ ప్రయాణం కోసం పెద్దలకు రూ.2 వేలుగా నిర్ణయించారు. పిల్లలకు రూ.1,600గా ఉంది. ఇది సింగిల్ వేకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వెళ్లి రావడానికి ఒకేసారి బుక్‌ చేసుకుంటే అయితే రూ.3,250 ఛార్జీ ఉంటుంది. ఈ ప్యాకేజీ సెలెక్ట్ చేసుకుంటే…. సాగర్ నుంచి శ్రీశైలం, శ్రీశైలం నుంచి సాగర్ వరకు లాంచీలో రావొచ్చు.

హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ సీఆర్‌వో 98485 40371, 98481 25720, నాగార్జునసాగర్‌ లాంచీ యూనిట్‌ 79979 51023 నంబర్ల ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకునేందుకు https://tgtdc.in/home వెబ్ సైట్ ను కూడా చూడొచ్చు.

సోమశిల నుంచి కూడా యాత్ర….

సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం షురూ అయింది. ఇటీవలనే ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి.నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ తీరంలోని సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ జర్నీ ఉంటుంది. వారానికి మూడు సార్లు ఈ ఆపరేషన్ ఉంటుంది. మంగళవారం, గురువారం, శనివారాల్లో ఉదయం 9 గంటలకు లాంచీ సోమశిల నుంచి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.

ఒకవైపు ప్రయాణానికి పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1600 వసూలు చేస్తున్నారు. లాంచీలో పర్యాటకులకు ఉదయం మరియు సాయంత్రం టీ, స్నాక్స్ మరియు లంచ్ అందిస్తారు. వన్ వే క్రూయిజ్ టూర్ ప్యాకేజీ ధరలతో పోల్చితే… రౌండప్ (రానుపోను) జర్నీకి ధరలు వేరుగా ఉంటాయి. ఈ వివరాలను కూడా తెలంగాణ టూరిజం వెబ్ సైట్ ( https://tgtdc.in/home ) లో చూడొచ్చు. లేదా స్థానికంగా ఉండే టూరిజం కార్యాలయంలో వివరాలను తెలుసుకోవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More