...
...
Next Story

Navodaya Admissions 2027 : నవోదయలో 6వ తరగతి అడ్మిషన్లు - దరఖాస్తు గడువు పొడిగింపు

Navodaya 6th Class Admission 2027 : జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఆగస్టు 7 వరకు పొడిగించారు. అర్హులైన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Published on: Aug 2, 2026, 11:55:58 IST
Advertisement

Navodaya 6th Class Admission 2027 : జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును నవోదయ విద్యాలయ సమితి పొడిగించింది. విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష
నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష

తాజా ప్రకటన ప్రకారం…. ఆన్‌లైన్ దరఖాస్తుల దాఖలుకు తుది గడువును 2026 ఆగస్టు 7 వరకు పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు ప్రస్తుతం ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్‌సైట్ https://navodaya.gov.in ద్వారా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించకుండా ఉచితంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించవచ్చు.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 665 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. చివరి నిమిషంలో హడావిడిని నివారించడానికి, ఆసక్తి గల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెంటనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.

జవహర్ నవోదయ విద్యాలయాల్లో సీటు వచ్చిన విద్యార్థి.. ఆరో తరగతి నుంచి 12వ తరగతి దాకా చదువుకునేందుకు మంచి అవకాశం ఉంటుంది. ఇక్కడ చదువుతోపాటుగా గేమ్స్, సమగ్ర వికాసానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లోని జవహర్ నవోదయ విద్యాలయాల్లోని సీట్లను కూడా భర్తీ చేస్తారు. ఒక్కోదాంట్లో గరిష్టంగా 80 మంది విద్యార్థుల వరకు ఆరో తరగతిలో అడ్మిషన్ ఉంటుంది.

నవోదయ పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. దీంట్లో 80 ప్రశ్నలు ఉంటాయి. మెుత్తం 2 గంటల వ్యవధి సమయం ఇస్తారు. మెంటల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు, ఆర్థమెటిక్ 20 ప్రశ్నలు ఉండగా.. లాంగ్వేజ్ టెస్ట్ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. విద్యా్రథులు హిందీ, తెలుగు, ఇంగ్లీష్.. కోరుకున్న భాషలో పరీక్ష రాయవచ్చు. ఒక ప్రశ్నకు 1.25 చొప్పున మార్కుల కేటాయిస్తారు. నెగెటివ్ మార్కులు ఉండవు.

ఈ లింక్ పై క్లిక్ చేసి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe