నాంపల్లి అగ్నిప్రమాద ఘటన - కొనసాగుతున్న రెస్యూ, రంగంలోకి NDRF బృందాలు
హైదరాబాద్ లోని నాంపల్లిలోని ఫర్నిచర్ గోడౌన్ లో శనివారం మంటలు చెలరేగడంతో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) సహాయక చర్యల్లో చేరింది. భవనంలోకి చిక్కిపోయిన వారి కోసం రెస్క్యూ కొనసాగుతోంది.
హైదరాబాద్ లోని నాంపల్లిలోని ఫర్నిచర్ గోడౌన్ లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాద శాఖ సిబ్బంది ఐదారు గంటల పాటు శ్రమించినప్పటికీ… మంటల తీవ్రతతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. వీరికితోడుగా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) కూడా సహాయక చర్యల్లో చేరింది.

"భవనం లోపల ముగ్గురు నుంచి నలుగురు వ్యక్తులు ఉన్నారని మేము అనుమానిస్తున్నాము. వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాం' అని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఫర్నిచర్ గోడౌన్ వద్ద మంటలు చెలరేగాయి. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ తో పాటు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. నగర సీపీ సజ్జనార్ కూడా ఘటనాస్థలిని సందర్శించారు.
మరోవైపు గంటలు గడిచే కొద్దీ బాధిత కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. వాచ్ మెన్ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. భవనం లోపల వాచ్‌మెన్ కుమారులు అఖిల్ (7), ప్రణీత్ (11) చిక్కుకున్నారు.
నాంపల్లి స్టేషన్ రోడ్ ఫర్నిచర్ మాల్ లో జరిగిన అగ్ని ప్రమాదం పై హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు.జిల్లా కలెక్టర్,హైదరాబాద్ పోలీస్ కమిషనర్ లతో ఫోన్ లో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన కారణాలు అడిగి తెలుసుకున్నారు. మంటలు విస్తరించకుండా పక్క భవనాలు ఖాళీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

