హైదరాబాద్‌-ఖమ్మం హైవేపై రోడ్డు ప్రమాదం… కారులో మంటలు చెలరేగి న్యూరోసర్జన్ సజీవదహనం

సూర్యాపేట జిల్లా 365వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను కారు బలంగా ఢీకొట్టడంతో నిప్పంటుకుని ఖమ్మం మమత ఆసుపత్రికి చెందిన ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ జగదీష్ అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.

Published on: Sep 21, 2026, 07:51:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సూర్యాపేట జిల్లా పరిధిలో ఆదివారం ఉదయం అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి జాతీయ రహదారి డివైడర్‌ను ఢీకొట్టడంతో క్షణాల్లో మంటలు వ్యాపించి ఓ వైద్యుడు కారులోనే తీవ్రంగా దగ్ధమై ప్రాణాలు కోల్పోయారు.

కారులో మంటలు చెలరేగి న్యూరోసర్జన్ సజీవదహనం
కారులో మంటలు చెలరేగి న్యూరోసర్జన్ సజీవదహనం

బాధితుడు ఖమ్మం జిల్లా వైరాకు చెందిన న్యూరోసర్జన్ డాక్టర్ జగదీష్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన ప్రస్తుతం ఖమ్మంలోని ప్రముఖ మమత ఆసుపత్రిలో నాడీ వ్యవస్థ శస్త్రచికిత్స నిపుణుడిగా (న్యూరోసర్జన్) సేవలందిస్తున్నారు.

డివైడర్ ను ఢీకొట్టడంతో….

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ జగదీష్ హైదరాబాద్ నుంచి తన స్వస్థలమైన ఖమ్మం వైపు కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్నారు. ఆదివారం ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో సూర్యాపేట పరిధిలోని 365వ జాతీయ రహదారిపైకి చేరుకోగానే, ఆయన నడుపుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇనుప గ్రిల్స్ (డివైడర్)ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు కారు ఇంజన్ భాగంలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.

ఇంజిన్ నుంచి దట్టమైన పొగలు, మంటలు క్షణాల్లో కారు మొత్తాన్ని చుట్టుముట్టాయి. ప్రమాద సమయంలో కారులో ఆయన ఒక్కరే ఉండటం, మంటలు వేగంగా వ్యాపించడంతో బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. దీంతో ఆయన కారులోనే సజీవదహనమయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఒక్క ఫైర్ ఇంజిన్‌తో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ, ఆలోపే కారు పూర్తిగా కాలి బూడిదైంది. అనంతరం పోలీసులు డాక్టర్ జగదీష్ భౌతికకాయాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More