...
...
Next Story

Integrated Bhu Bharati Portal : ఒకే చోట రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ సేవలు - ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ ప్రారంభం

Integrated Bhu Bharati Portal : ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ ప్రారంభమైంది. దీని ద్వారా ల్యాండ్‌, స‌ర్వే, రిజిస్ట్రేష‌న్ విభాగాల‌ను ఒకే గొడుగు కింద‌కు తీసుకువచ్చారు.ఈ ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్ట‌ల్‌ను 45రోజుల పాటు ప‌రిశీలించి త‌ర్వాత అవ‌స‌ర‌మైన మార్పులు, చేర్పులు చేస్తారు.

Published on: Apr 2, 2026, 22:57:13 IST
Advertisement

భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. రైతులకు భూ భద్రత కల్పిస్తూ, సులభరతమైన సేవలను అందించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది.

ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ప్రారంభం…

భూ సమస్యల పరిష్కారానికి నూతన ఇంటిగ్రేటెడ్ వెబ్ సైట్
భూ సమస్యల పరిష్కారానికి నూతన ఇంటిగ్రేటెడ్ వెబ్ సైట్

ఈ క్రమంలోనే భూభారతి పోర్టల్ రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ సేవలను ఒకే గొడుగు కిందకు తెస్తూ నూతన ఇంటిగ్రేటెడ్ వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు మండలాల్లో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ సేవలను రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం విటాయిపల్లిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగమైన గ్రామసభ వేదికగా ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు.

​ఆధార్ కార్డు తరహాలోనే ప్రతి భూయజమానికి వారి భూమికి ప్రత్యేకంగా భూధార్ నంబర్‌ను కేటాయిస్తారు. భూమి వివరాల్లో పారదర్శకత పెరిగి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. ​ఇకపై భూమి రిజిస్ట్రేషన్ సమయంలో కేవలం డాక్యుమెంట్లు మాత్రమే కాదు, క్షేత్రస్థాయి కొలతలతో కూడిన మ్యాప్‌ను కూడ జత చేయడం జరుగుతుంది. అమ్మేవారి నుంచి కొనేవారికి భూమిని కొలిచి అప్పగించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది.

​పాతకాలపు గొలుసు పద్ధతులకు స్వస్తి పలికి, అంగుళం కూడా తేడా లేకుండా కొలతలు తీసే రోవర్ యంత్రాలను ఇప్పటికే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందుకోసం 5300 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ప్రతి మండలానికి 6 నుంచి 7 మందిని కేటాయించారు.

ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… రాష్ట్రంలో10.984 రెవెన్యూ గ్రామాల‌ను క్ల‌స్ట‌ర్లు గా విభ‌జించి జీపీవోల‌ను నియ‌మించ‌డం జ‌రిగిందన్నారు. ​కొత్త ఇంటిగ్రేటెడ్ పోర్టల్ లో ఆన్‌లైన్ ద్వారా భూ వివరాలను అప్‌లోడ్ చేస్తే చాలు.. 24 నుంచి 48 గంటల్లో సర్వేయర్ క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలిస్తారని చెప్పారు. వారం రోజుల్లో సర్వే ప్రక్రియ పూర్తవుతుందని… డాక్యుమెంట్లు యజమానుల ఇంటి అడ్రస్‌కే నేరుగా చేరతాయని వివరించారు.

ఇవాళ అమ‌న‌గ‌ల్ మండ‌లంతోపాటు కుసుమంచి, అశ్వ‌రావుపేట‌, వ‌ట్‌ప‌ల్లి, కొస్గి మండ‌లాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ సేవలను 45రోజుల త‌ర్వాత అవ‌స‌ర‌మైన మార్పులు, చేర్పులు చేస్తారు. 2వ‌ద‌శ‌లో జిల్లాకో మండ‌లంలో ప్రారంభిస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks