ట్రైన్ జర్నీలో దంపతుల మధ్య గొడవ - క్షణికావేశంలో రైలు నుంచి దూకి మృతి..!

యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి - ఆలేరు రైలుమార్గంలో దంపతులు మృతి చెందారు. ఈ ఘటనకు ముందు వీరిద్దరూ రైలులో గొడవ పడ్డారు.  దీంతో భర్తతో గొడవ పడి క్షణికావేశంలో ముందుగా రన్నింగ్ ట్రైన్ నుంచి దూకిన భార్య సూసైడ్ చేసుకుంది.  ఆ వెంటనే భయంతో భర్త సింహాచలం కూడా ట్రైన్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

Published on: Dec 21, 2025, 11:42:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యాదాద్రి జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రైలులో ప్రయాణిస్తున్న నవదంపతులు గొడవ పడి క్షణికావేశంలో సూసైడ్ చేసుకున్నారు. ముందు భార్య ట్రైన్ నుంచి దూకి చనిపోగా… భయంతో భర్త కూడా టైన్ నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద వెలుగు చూసింది.

సింహాచలం(25), భవాని(19)
సింహాచలం(25), భవాని(19)

వివరాల ప్రకారం… ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం(25)కు, అదే జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవాని(19)తో రెండు నెలల క్రితం వివాహమైంది. భర్త సింహాచలం హైదరాబాద్‌లో ని ఓ కెమికల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నారు.

విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు వీరిద్దరూ…. మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ రైలులో సికింద్రాబాద్‌ నుంచి గురువారం రాత్రి బయలుదేరారు. ఈ మార్గంలో వీరిద్దరి మృతదేహాలు కనిపించాయి. ట్రాక్ మెన్ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో విచారణ చేపట్టారు. ముందుగా ట్రైన్ నుంచి జారిపడి మృతి చెందారని భావించారు. కానీ వీరిద్దరూ ట్రైన్ లో గొడవపడిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో క్షణాకికావేశంలో భార్య భర్త సూసైడ్ చేసుకున్నట్లు గుర్తించారు.

ముందు భార్య..ఆపై భర్త..

మృతికి ముందు దంపతులు రైలులో గొడవ పడ్డారు. దీంతో భార్య భవానీ క్షణికావేశంలో ముందుగా రన్నింగ్ ట్రైన్ నుంచి దూకింది. ఆ వెంటనే భయంతో భర్త సింహాచలం కూడా ట్రైన్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More