వరంగల్ నిట్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ నుంచి అప్లై చేయండి!
వరంగల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (నిట్ వరంగల్) 45.. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ మోడ్‌లో అప్లై చేయాలి. దరఖాస్తు తేదీ ఇప్పటికే ప్రారంభమైంది. 12-11-2025 నుంచి 12-12-2025 వరకు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

పోస్టులు
ప్రొఫెసర్-02, అసోసియేట్ ప్రొఫెసర్-08, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1 -08, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 -27 పోస్టులు ఉన్నాయి. మెుత్తం 45 పోస్టులకు రిక్రూట్‌మెంట్ ప్రారంభమైంది.
అర్హతలు
బీఈ/బి. టెక్, ఎంఇ/ఎం. టెక్ ఇన్ సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ , ఎంసీఎ, ఎంబీఎ, బి.ఎస్సీ, ఎం.ఎస్సీ పోస్టును బట్టి అర్హతలు ఉండాలి. కనీస వయోపరిమితి 35 సంవత్సరాలు కాగా గరిష్ట వయోపరిమితి 50 ఏళ్లుగా నిర్ణయించారు. వయస్సు సడలింపు సంస్థ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ వరకు అందిన అన్ని ఆన్‌లైన్ దరఖాస్తులను ఎంపిక ప్రక్రియలో పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో స్క్రూటినీ చేసి షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. బోధన & పరిశోధన సెమినార్ ప్రదర్శన ద్వారా తదుపరి లిస్ట్ తయారు అవుతుంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు ఎంపిక కమిటీ ముందు వ్యక్తిగత ఇంటర్వ్యూ కోసం హాజరుకావాలి.
ఎలా దరఖాస్తు చేయాలి
అధికారిక వెబ్‌సైట్ https://www.nitw.ac.in/కి వెళ్లండి.
నిట్ వరంగల్ ఉద్యోగాలు 2025 నోటిఫికేషన్‌ను సందర్శించండి.
సూచనలను జాగ్రత్తగా చదవండి, అర్హత ప్రమాణాలను తనిఖీ చేయండి.
దరఖాస్తు ఫారమ్‌ను ఎటువంటి తప్పులు లేకుండా పూరించండి.
దరఖాస్తు రుసుము చెల్లించండి (అవసరమైతే).
నింపిన దరఖాస్తు ఫారమ్‌కు అవసరమైన పత్రాలను జత చేయండి.
దరఖాస్తు ఫారమ్‌ను చివరి తేదీకి ముందు సమర్పించండి.
దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


