వరంగల్ నిట్ నుంచి ఉద్యోగ ప్రకటన - నోటిఫికేషన్ వివరాలు
వరంగల్ నిట్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు నవంబరు 30వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకు నవంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

నోటిఫికేషన్ ముఖ్య వివరాలు:
- ఉద్యోగ ప్రకటన - నిట్ వరంగల్
- పోస్టు పేరు - కంప్యూటర్ అసిస్టెంట్
- ఖాళీల సంఖ్య - 01
- అర్హత - పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో ఉత్తీర్ణులై ఉండాలి.
- ఈ పోస్టును కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేస్తారు.
- జీతం - నెలకు రూ. 30 వేలు చెల్లిస్తారు.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- దరఖాస్తు ఫారమ్ ను https://nitw.ac.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన ఫారమ్ ను ctl_hod@nitw.ac.in; tlc@nitw.ac.in కు మెయిల్ చేయాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ - 30 నవంబర్ 2025
- ఎంపిక విధానం - ఇంటర్వ్యూ
- ఇంటర్వ్వూ తేదీ - 2 డిసెంబర్ 2025.
- అధికారిక వెబ్ సైట్ - https://nitw.ac.in/
మరోవైపు వరంగల్ నిట్ లో టీచింగ్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 45 ఉద్యోగాలున్నాయి. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులున్నాయి. 12-11-2025 నుంచి 12-12-2025 వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ వరకు అందిన అన్ని ఆన్‌లైన్ దరఖాస్తులను ఎంపిక ప్రక్రియలో పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో స్క్రూటినీ చేసి షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. బోధన మరియు పరిశోధన సెమినార్ ప్రదర్శన ద్వారా తదుపరి లిస్ట్ తయారు అవుతుంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు ఎంపిక కమిటీ ముందు వ్యక్తిగత ఇంటర్వ్యూ కోసం హాజరుకావాలి. అధికారిక వెబ్‌సైట్ https://www.nitw.ac.in/ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

