Job Mela 2026 : నిరుద్యోగులకు అలర్ట్ - ఓయూ క్యాంపస్ లో జాబ్ మేళా, నెలకు మంచి జీతం!

Job Mela in Osmania University 2026 :హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో జూన్ 23న ఉచిత జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 26 నుంచి 32 ఏళ్ల లోపు పురుషులు, మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

Published on: Jun 20, 2026, 15:02:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Job Mela in Osmania University 2026 : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ వేదిక జాబ్ మేళా జరగనుంది. యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో ఆధ్వర్యంలో జూన్ 23వ తేదీన ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు.

ఉస్మానియా వర్శిటీ వేదికగా జాబ్‌ మేళా
ఉస్మానియా వర్శిటీ వేదికగా జాబ్‌ మేళా

ఖాళీల వివరాలు

ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ భద్రతా సేవల సంస్థ 'ఫోర్ట్ 9 సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్' (Fort 9 Security Services Pvt Ltd) లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 10 ఖాళీలున్నాయి.

  • ఉద్యోగ హోదా: ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ (ట్రైనీ)
  • పని స్వభావం: సెక్యూరిటీ సూపర్‌విజన్
  • మొత్తం ఖాళీలు: 10 పోస్టులు

ఏదైనా డిగ్రీ….

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కళాశాల నుండి 'ఏదైనా డిగ్రీ' ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 26 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు అర్హులైన పురుషులు, మహిళా అభ్యర్థులు హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 35,000 వరకు జీతం చెల్లిస్తారు.

ఇంటర్వ్యూ ఎక్కడంటే..?

అర్హత కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా లేదా అప్‌డేట్ చేసిన రెస్యూమ్ తో పాటు విద్యార్హతలకు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్ ప్రతులను వెంట తీసుకురావాలి. జూన్ 23వ తేదీన ఉదయం 11:00 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న 'ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో' కార్యాలయంలో ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి. అభ్యర్థులు నేరుగా ఈ కేంద్రానికి చేరుకుని ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు.

ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి లేదా ఏవైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు కంపెనీ హెచ్ఆర్ (HR) ప్రతినిధిని 9247526978 అనే ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More