OU PhD admissions 2026 : ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్లు - ఆలస్య రుసుంతో దరఖాస్తు గడువు పొడిగింపు
Osmania University PhD Admissions : ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్‌డీ ఎంట్రన్స్ టెస్ట్ - 2026 (కేటగిరీ-2) ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును పొడిగించారు. రూ.2,000 ఆలస్య రుసుముతో అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ (కేటగిరీ-2) ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు మరో అప్‌డేట్ వచ్చింది. పీహెచ్‌డీ ఎంట్రన్స్ టెస్ట్ - 2026 కి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల(ఆలస్య రుసుంతో) గడువును పొడిగించారు.

లేట్ ఫీజుతో గడువు పొడిగింపు…
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం….. ఎలాంటి ఆలస్య రుసుము (లేట్ ఫీజు) లేకుండా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించడానికి 2026 అక్టోబర్ 05వ తేదీతో తుది గడువు ముగిసింది. అయితే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులైన అభ్యర్థులకు అధికారులు మరో అవకాశం కల్పించారు. రూ. 2,000 ఆలస్య రుసుము చెల్లించి అక్టోబర్ 15, 2026 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించవచ్చని వెల్లడించారు.
నవంబరు రెండో వారంలో ప్రవేశ పరీక్షలు…
వివిధ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షలను 2026 నవంబరు రెండవ వారంలో నిర్వహించనున్నట్లు ప్రవేశాల విభాగం స్పష్టం చేసింది. ఈ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగస్టు 26, 2026న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అభ్యర్థులు సమగ్ర వివరాలు, ప్రవేశ పరీక్షల పూర్తి నిబంధనలు, అధికారిక సమాచారం మరియు తాజా అప్‌డేట్ల కోసం విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్లు అయిన www.osmania.ac.in లేదా www.ouadmissions.com లను క్రమం తప్పకుండా పరిశీలించాలని అధికారులు సూచించారు.
కేటగిరి - 2 కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఎంట్రెన్స్ పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభ చూపిన వారితో పాటు పాటు సెట్, నెట్ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఫైనల్ గా సీట్లు పొందిన వారి వివరాలను డిపార్ట్ మెంట్ల వారీగా విడుదల చేస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

