...
...
Next Story

ఇదేందయ్యా ఇది.. తెలంగాణలో ఒక్క రోజే 2 లక్షల 30 వేలకు పైగా డొమెస్టిక్ సిలిండర్లు డెలివరీ

Domestic Cylinders : తెలంగాణలో ఒక్క రోజే 2 లక్షల 30 వేలకు పైగా డొమెస్టిక్ సిలిండర్లు డెలివరీ అయ్యాయి. ఇది సాధారణంగా రోజూవారీ డెలివరీలతో పోలిస్తే ఎక్కువ.

Published on: Mar 14, 2026, 17:14:44 IST
Advertisement

తెలంగాణలో ఎల్పీజీపై సంక్షోభం నెలకొంది. కమర్షియల్ సిలిండర్లే కాదు.. గృహ వినియోగ సిలిండర్ల మీద జనాల్లో ఆందోళన ఉంది. ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు.. సాధారణ రోజువారీ సగటు కంటే అదనంగా 12,000 సిలిండర్లను శుక్రవారం(మార్చి 13, 2026) పంపిణీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

గ్యాస్ సిలిండర్లు
గ్యాస్ సిలిండర్లు

శుక్రవారం(మార్చి 13, 2026) పంపిణీ చేసిన మొత్తం 2,37,123 ఎల్పీజీ సిలిండర్లలో.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా 83,166, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) ద్వారా 88,257, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా 65,700 సిలిండర్లు పంపిణీ జరిగాయి.

తెలంగాణలో ఎల్పీజీ సిలిండర్ల రోజువారీ అవసరం 2.5 లక్షలు కాగా.. ఇందులో 86 శాతం గృహావసరాలకు, మిగిలిన 14 శాతం వాణిజ్య అవసరాలకు వినియోగిస్తారు.

రాష్ట్రంలో మొత్తం 1.29 కోట్ల క్రియాశీల గృహ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి 810 మంది పంపిణీదారులు సేవలు అందిస్తున్నారు. పౌర సరఫరాల శాఖ అందించిన సమాచారం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం 10,611 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వలను కలిగి ఉంది. ఇది సుమారు 6.97 లక్షల సిలిండర్లకు సమానం.

తెలంగాణ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కల్లూరి జగన్ మోహన్ రెడ్డి ప్రకారం, ఆర్డర్ల ఆకస్మిక పెరుగుదల పంపిణీ నెట్‌వర్క్‌ను స్తంభింపజేసింది. రాష్ట్రంలోని అనేక ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాలలో కార్యకలాపాలకు అంతరాయం కలిగిందని ఆయన అన్నారు.

తెలంగాణలో 810 ఎల్పీజీ పంపిణీదారులు 1.30 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ప్రతి నెలా దాదాపు 60 లక్షల ఎల్పీజీ గృహ సిలిండర్లు సరఫరా అవుతున్నాయన్నారు. మూడు లేదా నాలుగు రోజులుగా వాణిజ్య సిలిండర్ల సరఫరా దాదాపుగా లేదని కల్లూరి జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. కొంతమంది దగ్గర కొంత పాత స్టాక్ ఉండాలని, దానిని ప్రీమియం ధరకు విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks